Big Stories

AI :- ఏఐకు ప్రత్యేకమైన గైడ్‌లైన్స్.. దేశంలోనే మొదటిసారి..

AI :- ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ).. ప్రస్తుతం మానవ మేధస్సుకు ఏ మాత్రం తీసిపోని టెక్నాలజీ. ప్రతీ రంగంలో ఏఐను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి సంస్థలు అన్నీ ఆసక్తి చూపిస్తున్నాయి. కానీ మానవ మేధస్సుకు, కృత్రిమ మేధస్సుకు ఉన్న పెద్ద తేడా ఏంటంటే.. మనిషి ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది అవగాహన ఉంటుంది. ఏఐకు అలా కాదు. అందుకోసమే మొదటిసారి ఏఐకు ఒక ప్రత్యేకమైన గైడ్‌లైన్స్‌ను ఏర్పాటు చేసింది ఐసీఎమ్మార్.

- Advertisement -

ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను ఎవరికి నచ్చినట్టుగా వారు ఉపయోగించారు. అందుకే మొదటిసారి ఏఐకు ఒక ఎథికల్ గైడ్‌లైన్స్ అనేది ఏర్పాటు చేసింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్మార్). ముఖ్యంగా ఈ గైడ్‌లైన్స్ అన్నీ బయోమెడికల్ రీసెర్చ్, హెల్త్‌కేర్‌లో పాటించాల్సినవే అని తెలుస్తోంది. ఇప్పటికే హెల్త్ రంగంలో ఏఐ అవసరం చాలా పెరిగిపోయింది. కానీ దీని వల్ల ఎవరికీ నష్టం కలగకుండా ఉండడానికి ఐసీఎమ్మార్ ఈ గైడ్‌లైన్స్ ఆలోచనతో ముందుకొచ్చింది.

- Advertisement -

హెల్త్ రంగంలో ఏఐకు అందే సమాచారం ఎక్కువగా మనుషుల నుండి సేకరించిందే. దీనిపైనే ఏఐ ఫంక్షన్ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందుకే దీనికంటూ కొన్ని గైడ్‌లైన్స్ ఉండడం చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా ఇండియాలోని హెల్త్ కేర్ సెక్టార్‌లో ఏఐపై ఆధారపడుతున్న సందర్భాలు ఎక్కువవుతున్నాయి. అందుకే ఏఐ దృష్టిపెట్టాలనే కొన్ని రంగాలపై పరిశోధకులు ఫోకస్ చేశారు. క్లారిటీ, తేడాలు చూపించడం వంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించనున్నారు.

ఏఐ దృష్టిపెట్టని అంశాలు హెల్త్ సెక్టార్‌లో కీలకం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఐసీఎమ్మార్.. దానికి గైడ్‌లైన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ గైడ్‌లైన్స్ అనేవి కేవలం ఏఐ ఎలా పనిచేయాలనే కాకుండా.. మరికొన్ని ఏఐ టూల్స్‌ను డెవలప్ చేయడానికి కూడా ఉపయోగపడతాయని తెలుస్తోంది. స్టేక్‌హోల్డర్స్, ఇన్నోవేటర్స్, డెవలపర్స్, పేషెంట్స్, టెక్నాలజిస్ట్స్, రీసెర్చర్స్, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్.. ఇలా అందరికీ సంబంధించిన ఏఐ మోడల్స్ ఈ గైడ్‌లైన్స్‌లో పొందుపరిచి ఉంటాయి.

సోలార్ సిస్టమ్‌లో నాలుగు అగ్నిపర్వతాలు..

for more updates follow this link:-Bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News