BigTV English

Malnutrition : మహిళల్లో పోషకాహార లోపం కనిపెట్టే టూల్..

Malnutrition : మహిళల్లో పోషకాహార లోపం కనిపెట్టే టూల్..
malnutrition

malnutrition : కేవలం ఆరోగ్య సమస్యలకు చికిత్సను అందించే విషయంలోనే కాదు.. మనిషి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టే విషయంలో కూడా టెక్నాలజీలు ఎంతో అభివృద్ధిని సాధించాయి. అయినా కూడా శాస్త్రవేత్తలు తృప్తిపడడం లేదు. ఎప్పటికప్పుడు మనుషులకు ఉపయోగపడే టెక్నాలజీలను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా మహిళలకు ప్రత్యేకంగా ఉపయోగపడే ఒక టూల్‌ను తయారు చేశారు.


ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో పోషకాహార లోపం అనే సమస్య కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలకు చిన్న వయసేలోనే ఈ సమస్య ఎదురవుతోంది. దానికి తగినట్టుగా వైద్యులు కూడా వారికి డైట్ ప్లాన్స్‌ను అందిస్తున్నారు. పోషకాహార లోపం అనేది ఉందని కనిపెట్టిన తర్వాత పలు జాగ్రత్తలు తీసుకుంటే సమస్య దూరమయ్యే అవకాశం ఉంది. కానీ పోషకాహార లోపాన్ని ముందే కనిపెట్టగల టెక్నాలజీ మాత్రం ఇప్పటివరకు కనిపెట్టలేదు. తాజాగా స్కాట్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు దీనికోసం ఒక టూల్‌ను తయారు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీనేజ్ యువతులతో పోలిస్తే బంగ్లాదేశ్‌లో ఉన్న అమ్మాయిలు పోషకాహారం విషయంలో చాలా ఘోరమైన జీవితాన్ని జీవిస్తున్నట్టు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. పోషకాహారాన్ని పండించడమే లక్ష్యంగా కొందరు రైతులు ముందుకెళ్తున్నారు. అయినా కూడా కొన్ని ప్రాంతాల ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారన్ని పొందడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఫిష్‌లాంటి పోషకాహారాలు ప్రతీ ఒక్కరికీ లభించడం కష్టంగా మారింది.


పోషకాహార లోపం ఉన్న అమ్మాయిలు తల్లులుగా మారిన తర్వాత పిల్లల ఆరోగ్యంపై కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే కేవలం ఒక డైట్ అనేది వారి ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం సరిపోదని వారు నిర్ధారించారు. అంతే కాకుండా దీనివల్ల వారిలో ఒమెగా డిపెషీయన్సీ కూడా ఏర్పడే అవకాశం ఉందని వారు అన్నారు. అందుకే వారు ఏర్పాటు చేసే టూల్ ద్వారా పోషకాహార లోపం గురించి కనిపెడుతూ ఉండే అవకాశం ఉంటుందన్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×