EPAPER
Kirrak Couples Episode 1

Techno Coat: చలి నుంచి కాపాడే టెక్నో కోటు

Techno Coat: చలి నుంచి కాపాడే టెక్నో కోటు

Techno Coat: చలి చంపేస్తోందా? చలి మంటలు వేసినా తట్టుకోలేకపోతున్నారా? స్వెట్టర్లు కూడా చలిని ఆపలేకపోతున్నాయా? అయినా నో ప్రాబ్లం. ఒక్కసారి ఈ జాకెట్ వేసుకుని చూడండి.. చలి మీ దరిదాపుల్లోకి కూడా రాదు. మామూలు వాతావరణంలో ఎలాగైతే వెచ్చగా ఉండగలరో చలిలోనూ అలాగే ఉంటారు. అదీ ఈ కోటు మహత్యం. ఎందుకంటే ఇది టెక్నో కోటు. దీన్ని ధరించి యాక్టివేట్ చేసుకున్న నిమిషాల్లోనే 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు వెలువడి ఒళ్లంతా వెచ్చబడుతుంది. ఎంచక్కా చలిలోనూ పనులు చేసుకోవచ్చు. దీన్ని లండన్ లోని పెటిట్ ప్లీ కి చెందిన సైంటిస్టులు తచారు చేశారు. అయితే దీని ధర మాత్రం కాస్త ఎక్కువే. ఈ చలి కోటును కొనుగోలు చేయాలంటే 500 పౌండ్లు చెల్లించాలి. మన కరెన్సీలో అయితే 50 వేలకుపైగా చెల్లించాల్సి ఉంటుంది.


ఇంతకీ చలి కోటు ఎలా పనిచేస్తుంది?
స్వెట్టర్ ఒంటిని పూర్తిగా కప్పేస్తుంది. కానీ చలి కోటు అనేది కేవలం అరకోటు మాత్రమే. అంటే టీ షర్ట్ లేదా మామూలు షర్ట్ పైన దీన్ని ధరించొచ్చు. దీన్ని వేడిని నిల్వచేసుకుని కెమికల్ జెల్ నింపి రూపొందించారు సైంటిస్టులు. దీనికి ఎంట్రోపి వెస్ట్ అనే పేరు పెట్టారు. ఇక దీనికి ఎలాంటి బ్యాటరీలుగానీ, విద్యుత్తుగానీ అవసరం ఉండదు. అయితే ఈ కోటు వేడిని విడుదల చేయడం తగ్గిపోయిందని భావిస్తే వేడి నీళ్లలో కాసేపు నానబెట్టాలి. ఆ తర్వాత కొద్దసేపు ఆరబెట్టుకుని ధరించవచ్చు. వేడి చేసినప్పుడు ఆ నీటిలోని వేడిని ఈ హాప్ జాకెట్ లో ఉన్న జెల్ గ్రహించి నిల్వ చేసుకుంటుంది. దీంతో మళ్లీ ఈ ఎంట్రోపి వెస్ట్ వేడిని విడుదల చేస్తుంది. దీన్ని ధరించిన తర్వాత నడవొచ్చు, పనులు చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదంటారు శాస్త్రవేత్తలు.

స్వెట్టర్ కు, ఎంట్రోపి వెస్ట్ కు తేడా ఏంటి?
ఎంట్రోపి వెస్ట్ లోని జెల్ వేడి నీటిలోని ఉష్ణోగ్రతను గ్రహించి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. కానీ స్వెట్టర్ మాత్రం ఇలాంటిదేమీ చేయదు. స్వెట్టర్ ను ఉలెన్ తో తయారు చేస్తారు. నిజానికి చలిని తట్టుకోడానికి శరీరం ఉష్ణోగ్రతను విడుదల చేస్తుంది. ఆ ఉష్ణోగ్రత బయటకు వెళ్లకుండా స్వెట్టర్ లోని ఉన్ని అడ్డుకుంటుంది. అందుకే స్వెట్టర్ ధరిస్తే వెచ్చదనంగా అనిపిస్తుంది.


Related News

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Horoscope 29 September 2024: ఈ రాశి వారికి ఆటంకాలు.. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది!

Drivers cheated: వెలుగులోకి కొత్త రకం దొంగతనం.. ప్రమాదమని చెప్పి..!

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ దాఖలు..గట్టిగానే చుట్టుకున్న ‘ముడా’!

Big Stories

×