Big Stories

Gmail Update : జీమెయిల్ యూజర్లకు కొత్త అప్డేట్.. సెర్చ్ రిజల్ట్ విషయంలో..

- Advertisement -

Gmail Update : స్మార్ట్ ఫోన్స్ అనేవి ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో కచ్చితంగా మారిపోయాయి. చాలావరకు స్మార్ట్ ఫోన్స్ లేకుండా ఎవరి జీవితం ముందుకు వెళ్లడం లేదు. అందుకే అందులో కచ్చితంగా ఉండే యాప్స్ కూడా ఎప్పటికప్పుడు తమను తాము మెరుగుపరుచుకుంటూ యూజర్లకు మెరుగైన సేవలు అందించడమే టార్గెట్‌గా పెట్టుకున్నాయి. అందులో ఒకటి గూగుల్. గత కొన్నిరోజులుగా గూగుల్.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

గూగుల్ ప్రొడక్ట్స్ అనేవి ఎన్నో ఏళ్లుగా, ఎన్నో విధాలుగా స్మార్ట్ ఫోన్ యూజర్లకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. జీమెయిల్, గూగుల్ పే, సెర్చ్ ఇంజెన్.. ఇలా ఎన్నో సేవలు ఎప్పటినుండో యూజర్లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ తర్వాత కూడా ఎన్నో సెర్చ్ ఇంజెన్లు దీనికి పోటీగా రావాలనుకున్నాయి. అయినా కూడా గూగుల్ ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్లడంతో.. ఇంకా ఏ సెర్చ్ ఇంజెన్ కూడా గూగుల్ క్రేజ్‌ను అందుకోలేకపోయింది. అందుకే ఆ క్రేజ్‌ను నిలబెట్టుకోవడం కోసం గూగుల్ ప్రయత్నిస్తోంది.

జీమెయిల్‌ను ఎక్కువగా ఫోన్‌ను ఉపయోగిస్తున్నవారి కోసం గూగుల్ ఒక కొత్త అప్డేట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వారు ప్రత్యేకంగా ఏదైనా ఈమెయిల్ కోసం, లేదా ఏదైనా ఫైల్ కోసం వెతకాలి అనుకున్నప్పుడు ఈ జీమెయిల్ ఫోన్ ఫీచర్ వారికి సహాయపడనుంది. అంటే మునుపటి కంటి ఇప్పుడు జీమెయిల్ సెర్చ్ రిజల్ట్స్ అనేవి మరింత మెరుగ్గా మారనున్నాయని అర్థం. ఈ విషయాన్ని గూగుల్ స్వయంగా ప్రకటించింది. ఎక్కువసేపు కష్టపడకుండా వారు ఏ మెయిల్‌ను వెతుకుతున్నారో అది వారి కళ్ల ముందు పెట్టడానికి జీమెయిల్ సిద్ధపడుతోంది.

ఇప్పటివరకు జీమెయిల్ అనేది సెర్చ్ రిజల్ట్ విషయంలో జాగ్రత్తగానే ఉన్నా.. కొన్నిసార్లు కావాల్సిన మెయిల్ కోసం ఎక్కువసేపు వెతకాల్సి వచ్చేది. ఇప్పుడు అలా జరగదు అని గూగుల్ హామీ ఇస్తోంది. ఇప్పటినుండి జీమెయిల్‌లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ముందుగా రీసెంట్ మెయిల్స్‌ను చూపిస్తూ.. పాత మెయిల్స్ తర్వాత వస్తుంటాయని చెప్పింది. అంతే కాకుండా ఈ కొత్త ఫీచర్ అనేది పూర్తిగా యూజర్లకు సొంతం అని, అడ్మిన్ కంట్రోల్ లాంటిది ఏమీ ఉండదని గూగుల్ హామీ ఇచ్చింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News