EPAPER

TVS Electric Scooter : ఫుల్ ఛార్జింగ్ కు 307 కిలోమీటర్లు.. TVS నుంచి సూపర్ బ్యాటరీ బైక్…

TVS Electric Scooter : ఫుల్ ఛార్జింగ్ కు 307 కిలోమీటర్లు.. TVS నుంచి సూపర్ బ్యాటరీ బైక్…

TVS Electric Scooter : ఔను. మీరు చూసింది/చదివింది నిజమే. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సూపర్ బ్యాటరీ బైక్ త్వరలో రాబోతోంది. TVS మోటార్స్ మద్దతుతో ఏర్పాటైన స్టార్టప్ కంపెనీ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్… F77 పేరుతో ఓ కొత్త బ్యాటరీ బైక్ ను త్వరలో లాంచ్ చేయబోతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్, స్కూటీలతో పోలిస్తే… F77 ఏకంగా రెట్టింపు దూరం ప్రయాణం చేసే సామర్థ్యంతో రాబోతోంది.


ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్కూటీ టైప్ బ్యాటరీ బండ్లను పక్కనపెడితే… బైక్ టైప్ బండ్లలో… టార్క్ కంపెనీకి చెందిన Kratosలో 4 కిలో వాట్ల బ్యాటరీ ఉంది. ఇక ప్యూర్ కంపెనీకి చెందిన EV ETrystలో 3.5 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉంది. అదే రివోల్ట్ కు చెందిన RV400 బైక్ లో 3.24 కిలోవాట్ల బ్యాటరీ ఉంది. ఈ మూడు బైక్ లు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ తో దాదాపు 180 నుంచి 140 కిలోమీటర్లు ప్రయాణిస్తాయని కంపెనీలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి. అయితే వినియోగదారుల వాడకాన్ని బట్టి బ్యాటరీ బైక్ ల మైలేజ్ ఆధారపడి ఉంటుంది. అదే అల్ట్రావయోలెట్ F77లో ఏకంగా 10.5 కిలోవాట్ల బ్యాటరీని అమర్చుతున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు… F77 మైలేజ్ ఏ రేంజ్ లో ఉండబోతోందో.

మైలేజే కాదు… F77 రేటు కూడా దిమ్మతిరిగే రేంజ్ లోనే ఉండబోతోంది. ఉదాహరణకు టార్క్ Kratos బైక్ ఆన్ రోడ్ ధర లక్షా 75 వేల దాకా ఉంది. అదికూడా అన్ని సబ్సిడీలు కలుపుకుంటే. ఇక ప్యూర్ EV ETryst బైక్ ఆన్ రోడ్ ధర కూడా లక్షా 70 వేలకు పైగా ఉంది. 4 కిలోవాట్లు, 3.5 కిలోవాట్ల బ్యాటరీ బైక్ ల ధరే ఈ రేంజ్ లో ఉంటే… ఇక 10.5 కిలోవాట్ల బ్యాటరీతో వచ్చే F77 రేటు కూడా ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. F77 ధర ఎంతో కంపెనీ ఇంకా అధికారికంగా బయటపెట్టకపోయినా… అతి పెద్ద బ్యాటరీతో రాబోతున్న తొలి బైక్ కాబట్టి… ఆన్ రోడ్ ధర 3 లక్షలకు పైగానే ఉండే అవకాశం ఉంది.


వచ్చే నవంబర్ 24న అల్ట్రావయోలెట్ F77ను లాంచ్ చేయబోతున్నారు. అప్పుడే ధర సహా పూర్తి వివరాలను ప్రకటిస్తామని కంపెనీ వెల్లడించింది. అక్టోబర్ 23 నుంచి F77 బుకింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. 10 వేల రూపాయలు చెల్లించి ఈ బైక్ ను బుక్ చేసుకోవచ్చు. తొలి ఏడాది కాలంలో 10 వేల యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. ఆ తర్వాత క్రమంగా F77 ఉత్పత్తిని పెంచుతూ… ఏడాదికి లక్షా 50 వేల యూనిట్లను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×