BigTV English

Air Pollution : అదుపు చేయలేని స్థాయికి గాలి కాలుష్యం.. శాస్త్రవేత్తల హెచ్చరిక..

Air Pollution : అదుపు చేయలేని స్థాయికి గాలి కాలుష్యం.. శాస్త్రవేత్తల హెచ్చరిక..

ఒకవైపు గాలి కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు గాలిలో కలిసే కార్బన్ డయాక్సైడ్ శాతం మోతాదుకు మించి విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా చేసిన స్టడీ ప్రకారం గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం రికార్డ్ స్థాయిని చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం శాస్త్రవేత్తలతో పాటు ప్రజలకు కూడా భయపెడుతోంది. అందుకే శాస్త్రవేత్తలు దీనిపై పూర్తి ఫోకస్ పెట్టారు.


1900 నుండి పోలిస్తే.. 2022లోనే గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం రికార్డ్ స్థాయిని చేరుకుంది. దీనికి కోవిడ్ ఒక కారణం అయితే.. కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవడానికి బొగ్గుతో కరెంటు తయారీకి ప్రయత్నాలు జరగడం మరో కారణం. ఎనర్జీ ప్రొడక్షన్ కోసం గాలులోకి విడుదలవుతున్న హానికరమైన రసాయనాల శాతం 0.9 నుండి 36.8 జైగోషన్‌కు పెరిగిపోయింది. 10 వేల ఎయిర్‌క్రాఫ్ క్యారియర్స్.. ఒక్క జైగేషన్‌తో సమానం.

ఆయిల్, బొగ్గు లేదా నేచురల్ గ్యాస్ లాంటివి కాల్చినప్పుడు కార్బన్ డయాక్సైడ్ గాలిలోకి విడుదలవుతుంది. ఈ గ్యాస్ గాలిలో కలిసినప్పుడు వాతావరణాన్ని వెచ్చగా మార్చుతుంది. గతేడాది వీటిని కాల్చాల్సిన అవసరం ఎక్కువగా ఉండడంతో గ్లోబల్ వార్మింగ్‌ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కువగా ఎనర్జీని ఉపయోగించకుండా కంట్రోల్‌లో ఉంచగలిగితే గ్లోబల్ వార్మింగ్‌ను అదుపులో ఉంచవచ్చని క్లైమేట్ సైంటిస్టులు సూచిస్తున్నారు.


ఇప్పటినుండి గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఒక్కశాతం పెరిగినా కూడా అది పోల్చలేని ప్రమాదాన్ని తీసుకురాగలదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలా జరిగిన తర్వాత భూమిని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడానికి ఏ టెక్నాలజీ కూడా పనిచేయదని వారు అన్నారు. ఇలా జరగడం మానవాళి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా భూమికి కూడా చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని వారు బయటపెట్టారు. 2022లోనే కేవలం బొగ్గు నుండి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ శాతం 1.6 రెట్లు పెరిగిందని వారు తెలిపారు.

ఏసియాలో నేచురల్ గ్యాస్ రేట్ల నుండి తప్పించుకోవడానికి చాలామంది బొగ్గుపై ఆధారపడడం వల్లే గ్లోబల్ వార్మింగ్ శాతం పెరిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అంతే కాకుండా ఎయిర్‌లైన్ ట్రాఫిక్ కూడా గత కొన్నేళ్లలో విపరీతంగా పెరిగిపోయింది. దీనికి ఉపయోగపడే బర్నింగ్ ఆయిల్ వల్ల 2.5 శాతం కార్బన్ డయాక్సైడ్ గాలిలో కలుస్తుందని తేలింది. 1900 నుండి గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం ప్రతీ సంవత్సరం పెరుగుతూనే వస్తుందని వారు గుర్తుచేశారు. 2020లో కోవిడ్ కారణంగా ప్రయాణాలు జరగలేదు కాబట్టి ఇది కాస్త అదుపులోకి వచ్చిందన్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×