EPAPER

Facebook : 11 వేల మంది ‘బుక్’ అయ్యారు.. H1B వీసా హోల్డర్ల పరిస్థితేంటి?

Facebook : 11 వేల మంది ‘బుక్’ అయ్యారు.. H1B వీసా హోల్డర్ల పరిస్థితేంటి?

Facebook : మెటా నుంచి ఉద్యోగుల్ని తొలగించబోతున్నామని చెప్పి కొన్ని గంటలు తిరక్కముందే… ఏకంగా 11 వేల మందిని ఇంటికి పంపనున్నట్లు సంచలన ప్రకటన చేశారు… ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌. మెటా మొత్తం సిబ్బందిలో ఇది 13 శాతానికి సమానం. తీసేసే ఉద్యోగులకు మెయిల్స్ పంపుతామని జుకర్‌బర్గ్‌ చెప్పడంతో… ఎవరెవరి ఉద్యోగాలు ఊడతాయోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.


11 వేల మందిని తొలగించబోతున్నట్లు మెటా సీఈఓ జుకర్‌బర్గ్‌ ప్రకటించాక… ఏయే దేశాల్లో ఏ మేరకు కోతలు ఉంటాయనేది తెలీక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. భారత్‌లోని మెటా ఉద్యోగుల్లోనూ అదే పరిస్థితి. మెటా ఆధ్వర్యంలోని ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌లో… భారత్‌లో 300 నుంచి 400 మంది ఉద్యోగులు ఉన్నారు. వీటిలో వాట్సప్ లోనే అతి తక్కువగా 60 మంది పనిచేస్తున్నారు.
మరి తీసేసే వారిలో ఈ 400 మంది ఉద్యోగుల్లో ఎందరు ఉంటారోనని సిబ్బంది టెన్షన్ పడుతున్నారు.

మరోవైపు… అమెరికాలో పని చేస్తూ ఉద్యోగాలు కోల్పోయిన వారిలో H1B వీసాహోల్డర్లు ఉంటే… ఇమ్మిగ్రేషన్‌ పరంగా వారికి అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను కంపెనీ అందిస్తుందని జుకర్‌బర్గ్‌ తెలిపారు. అమెరికాలో పనిచేసే విదేశీయులకు H1B వీసా జారీ చేస్తారు. ఒకవేళ అకస్మాత్తుగా ఉద్యోగం పోతే, ఆ వ్యక్తి వీసాను స్పాన్సర్‌ చేసే మరో కంపెనీలో ఉద్యోగాన్ని 2 నెలల్లోపు వెతుక్కోవాల్సి ఉంటుంది. లేకపోతే వీసా గడువు ముగిసిపోతుంది. చాలా అమెరికన్‌ కంపెనీల్లో భారత్, చైనా నుంచి ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో వీదేశీయుల సంఖ్య 15 శాతం పైనే. ఇప్పుడు వారిలో ఎంత మంది ఉద్యోగాలు కోల్పోతారో… వారందరి H1B వీసాను ఏయే కంపెనీలు స్ఫాన్సర్ చేసేందుకు ముందుకు వస్తాయోనని… ఫేస్‌బుక్‌ సిబ్బంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇమ్మిగ్రేషన్‌ పరంగా సాయమందిస్తామని జుకర్‌బర్గ్‌ చెప్పినా… అందరికీ అండగా నిలవడం సాధ్యమేనా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×