EPAPER

UPSC CDSE: 459 ఖాళీల భర్తీకి యూపీఎస్సీ సీడీఎస్‌ఈ (2)- 2024 నోటిఫికేషన్ విడుదల.. తొందరగా అప్లై చేసేయండి

UPSC CDSE: 459 ఖాళీల భర్తీకి యూపీఎస్సీ సీడీఎస్‌ఈ (2)- 2024 నోటిఫికేషన్ విడుదల.. తొందరగా అప్లై చేసేయండి

COMBINED DEFENCE SERVICES EXAMINATION (II) 2024 NOTIFICATION: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎప్పట్నుంచో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం యూపీఎస్సీ భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇటీవల.. కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (CDS) ఎగ్జామినేష‌న్(II)-2024 నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని దాదాపు 459 ఖాళీలను భర్తీ చేయనున్నారు.


విభాగాల వారీగా ఖాళీలు చూసుకుంటే..

ఇండియన్ మిలిటరీ అకాడమీ(IMA), డెహ్రాడూన్ (159వ కోర్సు): 100 పోస్టులు ఉన్నాయి. అలాగే ఇండియన్ నేవల్ అకాడమీ(INA), ఎజిమలలో 32 పోస్టులు ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ(AFA), హైదరాబాద్ (218 F(P) కోర్సు)లలో 32 పోస్టులను భర్తీ చేస్తారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మెన్) (122వ SSC కోర్సు)లో మొత్తం 276 పోస్టులు ఉన్నాయి. ఇక చివరగా.. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (ఉమెన్‌) (36వ SSC కోర్సు)లో 19 పోస్టులను భర్తీ చేయనున్నారు.


విద్యార్హత

మిలిటరీ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వారు డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. నేవల్ అకాడమీ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్‌ఫోర్స్ అకాడమీ పోస్టులకు డిగ్రీ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అదే క్రమంలో ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో అవగాహన ఉండాలి. అయితే ఉమెన్స్ విషయానికొస్తే.. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఎస్ఎస్‌సీ నాన్ టెక్నికల్ పోస్టులకు అర్హులు.

Also Read: పరీక్ష లేకుండానే జాబ్స్.. వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్!

మిలిటరీ అకాడమీ పోస్టులకు, నేవల్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు 25 ఏళ్ల లోపు ఉండాలి. ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కోసం 20-24 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే దరఖాస్తు ఫీసు విషయానికొస్తే.. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు. మిగతా కేటగిరీ అభ్యర్థులు రూ.200 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హైదరాబాద్, హనుమకొండ (వరంగల్ అర్బన్), వరంగల్, విశాఖ పట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం వంటి ప్రాంతాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు రెండు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్‌లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ వంటివి నిర్వహించి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.

Also Read: TSPSC Group-IV: గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్!

అయితే ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఆసక్తిగల అభ్యర్థులు 2024 జూన్ 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏవైనా తప్పులు ఉంటే జూన్ 5 నుంచి జూన్ 11 లోగా సవరించుకోవాలి. సెప్టెంబర్ 1న ఎగ్జామ్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు 2025 జూలైలో కోర్సులు ప్రారంభం కానున్నాయి.

Tags

Related News

SSC GD Recruitment 2024: టెన్త్ అర్హతతో 39,481 ఉద్యోగాలు

SBI Recruitment 2024: ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. అర్హతలివే !

ITBP Recruitment 2024: టెన్త్ అర్హతతో 819 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా !

THSTI Recruitment 2024: టీహెచ్ఎస్టీఐలో మేనేజర్ పోస్టులు..అర్హతలివే !

UBI Recruitment 2024: యూనియన్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలివే !

CISF Recruitment 2024: గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు

ITBP Recruitment 2024: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. అర్హతలివే !

Big Stories

×