EPAPER
Kirrak Couples Episode 1

UPSC : UPSC – కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌.. ఎంపిక ప్రక్రియ ఇలా..?

UPSC : UPSC – కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌.. ఎంపిక ప్రక్రియ ఇలా..?

UPSC : కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కు నిర్వహించేందుకు UPSC ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 341 ఖాళీలున్నాయి. ఇండియన్‌ మిలిటరీ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. మిలిటరీ అకాడెమీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. నేవల్‌ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ లో ఉత్తీర్ణత సాధించాలి. ఎయిర్‌ ఫోర్స్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివి ఉండాలి.


రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు. మిగిలినవారు రూ.200 చెల్లించాలి. జనవరి 10 వరకు ఆన్‌లైన్‌ లో దరఖాస్తులను స్వీకరిస్తారు. 2023 ఏప్రిల్‌ 16న పరీక్ష నిర్వహించనున్నారు.

మొత్తం ఖాళీలు : 341


1. ఇండియన్‌ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), డెహ్రాడూన్‌- 100

2. ఇండియన్‌ నేవల్‌ అకాడమీ (ఐఎన్‌ఏ), ఎజిమల- 22

3. ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ (ఏఎఫ్‌ఏ), హైదరాబాద్‌- 32

4. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ, చెన్నై, ఓటీఏ ఎస్‌ఎస్‌సీ మెన్‌ నాన్‌ టెక్నికల్‌- 170

5. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ, చెన్నై, ఓటీఏ ఎస్‌ఎస్‌సీ ఉమెన్‌ నాన్‌ టెక్నికల్‌- 17

విద్యార్హత : మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉండాలి. నేవల్‌ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత సాధించాలి. ఎయిర్‌ ఫోర్స్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి. ఓటీఏ ఎస్‌ఎస్‌సీ నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ వైద్య పరీక్షలు ఆధారంగా
పరీక్ష : ఒక్కో పేపర్‌కు వంద చొప్పున మొత్తం 300 మార్కులకు ఇంగ్లీష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు : జనవరి 10 వరకు స్వీకరణ
పరీక్ష తేదీ: 2023, ఏప్రిల్‌ 16
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.
వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

Related News

ITBP Recruitment: ఐటీబీపీలో భారీగా ఉద్యోగాలు

Indian Navy Recruitment 2024: డిగ్రీ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

RRC WR Recruitment 2024: టెన్త్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

Big Stories

×