Big Stories

Telangana Highcourt : కోర్టుల్లో ఉద్యోగాలు.. ఎంపిక ప్రక్రియ ఎలాగంటే..?

Telangana Highcourt : తెలంగాణలోని వివిధ కోర్టుల్లో 96 స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3 పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు దరఖాస్తులు ఆహ్వానించింది. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్‌ టైప్‌రైటింగ్‌లోనూ అర్హత సాధించాలి. అభ్యర్థులకు నిమిషానికి 45 పదాలు టైప్‌ చేసే సామర్థ్యం ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18-34 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంగ్లీష్‌ షార్ట్‌హ్యాండ్‌ టెస్ట్‌లో మెరిట్‌ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు.

- Advertisement -

రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో 144 టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్‌ టైప్‌రైటింగ్‌లోనూ అర్హత సాధించాలి. నిమిషానికి 45 పదాలు టైప్‌ చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18-34 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంగ్లీష్‌ టైప్‌రైటింగ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

- Advertisement -

తెలంగాణలోని వివిధ కోర్టుల్లో 84 కాపీయిస్ట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు 12వ తరగతి/ ఇంటర్మీడియట్‌ చదివి ఉండాలి. ఇంగ్లీష్‌ టైప్‌రైటింగ్‌లోనూ అర్హత సాధించాలి. నిమిషానికి 45 పదాలు టైప్‌ చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18-34 ఏళ్ల మధ్య ఉండాలి. టైప్‌రైటింగ్‌ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈ మూడు రకాల పోస్టులకు దరఖాస్తు ఫీజు : రూ.400
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం : 25-05-2023
దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 15-06-2023
స్కిల్‌ టెస్ట్‌ తేదీ : జులై 2023

వెబ్‌సైట్‌: https://tshc.gov.in/getRecruitDetails

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News