EPAPER

SSC MTS Notification 2024: టెన్త్ పాసైతే చాలు.. ఈ ప్రభుత్వ ఉద్యోగం మీకే.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

SSC MTS Notification 2024: టెన్త్ పాసైతే చాలు.. ఈ ప్రభుత్వ ఉద్యోగం మీకే.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

SSC MTS Notification 2024: టెన్త్ క్వాలిఫికేషన్ తో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) త్వరలో MTS 2024 నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. నివేదిక ప్రకారం.. 1500 కంటే ఎక్కువ SSC MTS పోస్టులపై రిక్రూట్ మెంట్ జరిగే అవకాశం కనిపిస్తోంది. SSC Exam 2024 క్యాలెండర్ ప్రకారం.. దరఖాస్తు ప్రక్రియను జూన్ 7 2024 లోపు ప్రారంభించవచ్చని తెలుస్తోంది. SSC MTS 2024 కు కావలసిన విద్యార్హత, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, రిక్రూట్ మెంట్ ప్రక్రియ, దరఖాస్తు ప్రక్రియ మొదలైన వాటి గురించి తెలుసుకుందాం.


SSC MTS 2024కు కావలసిన వయో పరిమితి

SSC MTS 2024 కు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థి వయసు కనీసం 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. కొన్ని విభాగాల్లో వయసు పరిమితి 27 ఏళ్ల వరకు కూడా ఉంది. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులందరికీ గరిష్ట వయోపరిమితి నుంచి సడలింపు ఉంటుంది.


OBC కేటగిరీ వారికి మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి ఐదేళ్లు, డిసేబుల్డ్ జనరల్ కేటగిరీ వారికి పదేళ్లు, వికలాంగ OBC కేటగిరీ వారికి 13 సంవత్సరాలు, డిసేబుల్డ్ SAC-ST వర్గం వారికి పదిహేను సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

Also Read: NEET UG 2024: నీట్ ఆన్సర్ కీ విడుదల..

అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాసై ఉండాలి.

దరఖాస్తు చేసేందుకు అన్ని వర్గాల అభ్యర్థులకు వేర్వేరు దరఖాస్తు రుసుములు నిర్ణయించింది బోర్డు. జనరల్ కేటగిరీ – రూ 100, OBC కేటగిరీ – రూ 100, ఆర్థికంగా బలహీన వర్గం – రూ 100, ఎస్సీ వర్గం- సడలింపు, ST వర్గం- సడలింపు, వికలాంగ వర్గం- సడలింపు, మహిళల వర్గం – తగ్గింపు, మాజీ సైనికుడు- మినహాయింపు ఉంటుంది.

రిక్రూట్ మెంట్ ప్రక్రియ

SSC MTS 2024 రిక్రూట్ మెంట్ ప్రక్రియ కింద టైర్ 1, టైర్ 2 అర్హత గల అభ్యర్థులను రిక్రూట్ చేస్తారు. ఇది సీబీటీ మోడల్ లో నిర్వహిస్తారు. హల్దార్ పోస్టుల రిక్రూట్ మెంట్ కోసం ఫిజికల్ టెస్ట్ కూడా చేస్తారు.

Also Read: RRC SER Recruitment 2024: సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఆ రోజే చివరి తేదీ..!

SSC MTS 2024 కోసం ఎలా దరఖాస్తు చేయాలి..?

దరఖాస్తు చేయడానికి.. ముందుగా ssc.gov.in వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాలి. హోమ్ పేజీలో SSC MTS 2024 లింక్‌పై క్లిక్ చేసి.. అక్కడ అడిగిన సమాచారాన్ని నింపాలి. అవసరమైన సర్టిఫికేట్ల కాపీలను స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుమును ఆన్లైన్ లో చెల్లించాలి. అంతా అయ్యాక దరఖాస్తు అయినట్లు పేజీ ఓపెన్ అవుతుంది. దానిని డౌన్ లోడ్ చేసుకుని మీ వద్ద ఉంచుకోవాలి.

Related News

ITBP Recruitment: ఐటీబీపీలో భారీగా ఉద్యోగాలు

Indian Navy Recruitment 2024: డిగ్రీ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

RRC WR Recruitment 2024: టెన్త్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

Big Stories

×