EPAPER

SSC GD Recruitment 2024: టెన్త్ అర్హతతో 39,481 ఉద్యోగాలు

SSC GD Recruitment 2024: టెన్త్ అర్హతతో 39,481 ఉద్యోగాలు

SSC GD Recruitment 2024: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 39,481 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను 2025 సంవత్సరంలో జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు ఎస్ఎస్‌సీ వెల్లడించింది. అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టుల కోసం చివరి తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.


పూర్తి వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య : 39,481


విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఫిజికల్ స్టాండర్ట్స్: పురుష అభ్యర్థులు తప్పనిసరిగా 170 సెంటీ మీటర్ల ఎత్తు కలిగి ఉండాల. మహిళా అభ్యర్థులు 157 సెంటీ మీటర్లు ఉండాలి.

వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.  మాజీ సైనిక ఉద్యోగులు, మహిళలు, ఎస్టీ, ఎస్సీలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, వైద్య పరీక్షలు. ధృవపత్రాల పరిశీలన , రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Also Read: గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు కూడా ఆన్ లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్టణం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చీరాల, కర్నూలు, తిరుపతి, చీరాల, రాజమహేంద్రవరం

తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు: కరీంనగర్, హైదరాబాద్, వరంగల్

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 05.09.2024
దరఖాస్తులకు చివరి తేదీ: 14.10.2024

Related News

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BHEL Jobs 2024: హైదరాబాద్‌లోని భెల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. అర్హతలివే!

LPSC Recruitment 2024: ఎల్‌పీఎస్‌సీలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. అర్హతలివే !

RRB NTPC Recruitment 2024: గుడ్ న్యూస్.. రైల్వేలో 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Big Stories

×