SBI :ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సెంటర్ రెగ్యులర్ ప్రాతిపదికన 47 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లీడ్, పీఎంవో లీడ్, చీఫ్ మేనేజర్, టెక్ ఆర్కిటెక్ట్, అబ్జర్వబిలిటీ అండ్ మానిటరింగ్ స్పెషలిస్ట్ విభాగాల్లో ఖాళీలున్నాయి. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంసీఏ చేసి ఉండాలి. అలాగే పని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టులు : అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు రుసుం : జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలకు రూ.750
( ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు)
ఆన్‌లైన్ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 05-06-2023
వెబ్‌సైట్: https://sbi.co.in/web/careers/
Leave a Comment