EPAPER

SBI Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SBI Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SBI Recruitment: నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ మేరకు ఎస్‌బీఐలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ట్రడే్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎస్‌బీఐ ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్‌లో మిడిల్ మేనేజ్ మెంట్ గ్రేడ్ సర్వీసెస్ 2లోని టీఎఫ్‌ఓలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది.


దరఖాస్తులకు చివరి తేదీ..ఎప్పుడంటే?

ఎస్‌బీఐ విడుదల చేసిన టీఎఫ్ఓ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 27 వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అయితే మొత్తం 150 మందిని ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్లను రిక్రూట్ చేసుకోనుంది. ఇందులో జనరల్ కేటగిరీకి 61, ఎస్సీలకు 25, ఎస్టీలకు 11, ఓబీసీలకు 38, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 15 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 2023 డిసెంబర్ 31నుంచి 32 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులుగా పేర్కొంది. ఈ పోస్టులకు అవసరమైన విద్యార్హతలతోపాటు అవసరమైన అనుభవం ఉండాలి. మిగతా వివరాల కోసం sbi.co.in వెబ్ సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌బీఐ నోటిఫికేషన్‌లో పేర్కొంది.


ఎంపిక, నియామకం…

ఉద్యోగాలకు మొదట అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. షార్ట్ లిస్ట్ చేయడానికి బ్యాంక్ ఒక కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీ ఇంటర్వ్యూలకు పిలుస్తుంది. ఇంటర్వ్యూలో 100 మార్కులు ఉంటాయి. ఇక్కడ అర్హత సాధించిన అభ్యర్థులకు మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను సిద్ధం చేస్తుంది. ఎక్కువ మంది అభ్యర్థులు కటాఫ్ మార్కులు సాధిస్తు వయస్సు ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తామని బ్యాంక్ పేర్కొంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా నియమించే అవకాశం ఉందని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. పోస్టింగ్ కోసం సూచించిన నగరాలైన కోల్ కతా, హైదరాబాద్‌లలో పనిచేయాల్సి ఉంటుంది.

అర్హతలు..

ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంిచ గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి. దీంతోపాటు ఐఐబీఎఫ్ ద్వారా ఫారెక్స్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. సర్టిఫికెట్ ఫర్ డాక్యుమెంటరీ క్రెడిట్ స్పెషలిస్ట్ సర్టిఫికేషన్ లేదా సిర్టిఫఇకెట్ ఇన్ ట్రేడ్ ఫైనాన్స్ లేదా సర్టిఫికెట్ ఇన్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. అలాగే ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో సూపర్ వైజర్ హోదాలో ఎగ్జిక్యూటీవ్‌గా ట్రేడ్ ఫైనాన్స్ ప్రొసెసింగ్‌లో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. దీంతో పాటు అద్భుతమైన కమ్యూనికేషన్, ప్రజంటేషన్, ప్రాసెసింగ్ పైపుణ్యాలు ఉండాలి.

Tags

Related News

ITBP Recruitment: ఐటీబీపీలో భారీగా ఉద్యోగాలు

Indian Navy Recruitment 2024: డిగ్రీ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

RRC WR Recruitment 2024: టెన్త్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

Big Stories

×