EPAPER

RRC WCR Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 3317 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRC WCR Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 3317 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRC WCR Recruitment 2024(Latest central government jobs): నిరుద్యోగులకు శుభవార్త. మధ్యప్రదేశ్ జబల్‌పూర్ కేంద్రంగా నిర్వహించే వెస్ట్ సెంట్రల్ రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 3317 అప్రెంటిస్ షిప్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎంపిక అయిన అభ్యర్థులకు రైల్వే డివిజన్లు, యూనిట్లలో పోస్టింగ్ కేటాయిస్తారు. అర్హత ఉన్న వారు ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.


పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 3317 పోస్టులు

విభాగాలు:
ఏసీ మెకానిక్, బుక్ బైండర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్‌మాన్ ,ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హౌస్ కీపర్, మెషినిస్ట్ ,పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, సర్వేయర్, వెల్డరు, వైర్‌మ్యాన్ తదితర విభాగాల్లో అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.


అర్హత: కనీసం 50% మార్కులతో పదోతరగతి, ఇంటర్ పాసైనవారు అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్ కోసం అప్లై చేసుకునేవారు ట్రేడ్‌లో అభ్యర్థులకు తప్పనిసరిగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.

వయోపరిమితి: ఆగస్టు 5, 2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు రూ. 141 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు , మహిళలకు ఫీజు రూ. 41 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు పదోతరగతి, ఇంటర్, ఐఐటీ ట్రేడ్ సర్టిఫికెట్లలోని మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. చివరగా ఒక మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. మెరిట్ లిస్టులో వారిని అందుబాటులో ఉన్న అప్రెంటిస్ ఖాళీల ఆధారంగా నిర్దిష్ట నిష్పత్తిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అర్హత సాధించినవారికి చిట్ట చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు.

ఎంపికయ్యే వారిలో 1262 మందికి డబ్ల్యూసీఆర్ పరిధిలోని జబల్‌పూర్ డివిజన్‌లో పోస్టింగ్ ఇస్తారు. 28 మందికి జబల్పూర్ వెస్ట్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వాటర్ లో 824 మందికి భోపాల్ డివిజన్‌లో 832 మందికి కోటా డివిజన్‌లో, 175 మందికి భోపాల్ వరకు షాప్‌లో 196 మందికి కోటా వర్క్ షాప్‌లో పోస్టింగ్ ఇస్తారు.

Also Read: గుడ్ న్యూస్.. సదన్ డివిజన్‌లో 400 ఉద్యోగాలు.. అర్హతలివే !

ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఆగస్ట్ 5, 2024.
దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 4, 2024.
అధికారిక వెబ్‌సైట్ wcr. indianrailways.gov.in

Related News

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BHEL Jobs 2024: హైదరాబాద్‌లోని భెల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. అర్హతలివే!

Big Stories

×