EPAPER

RRB JE Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 7951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

RRB JE Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..  రైల్వేలో 7951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

RRB JE Recruitment 2024: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నుంచి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7951 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 7951 పోస్టులు
విభాగాల వారిగా..
కెమికల్ సూపర్‌వైజర్ /రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్/ రీసర్చ్ :17 పోస్టులు
జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్: 7934 పోస్టులు
వయో పరిమితి:
అన్ని పోస్టులకు వయో పరిమితి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
విద్యార్హత:
పోస్టుల వారీగా విద్యార్హతను నిర్ణయించారు. ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్లో చూడవచ్చు.
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ వివిధ దశల్లో నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మొదటి దశ, రెండవ దశ అని రెండు దశల్లో ఉంటుంది. సీబీఐటీలో ప్రతి తప్పు సమాధానానికి కేటాయించిన మార్కుల్లో 1/3 వ వంతు నెగెటివ్ మార్కు ఉంటుంది.

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్​ రైల్వేలో 2,424 ఉద్యోగాలు, అర్హతలివే !


దరఖాస్తు ఫీజు:
అప్లికేషన్ ఫీజుగా రూ. 500 చెల్లించాలి. మొదటి దశ సీబీఐటీకి హాజరైన తర్వాత బ్యాంకు ఛార్జీలు మినహాయించి రూ . 400 తిరిగి ఇస్తారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/ క్రెడిట్ కార్డులు లేదా యూపీఐ ద్వారా మాత్రమే ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులను స్వీకరిస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ ను సంప్రదించవచ్చు.
దరఖాస్తులు ప్రారంభం: జులై 30, 2024.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 29, 2024.

Related News

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BHEL Jobs 2024: హైదరాబాద్‌లోని భెల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. అర్హతలివే!

Big Stories

×