Big Stories

BDL : ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీ.. ఎంపిక ప్రక్రియ ఎలాగంటే..?

BDL : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌, బెంగళూరు, భానూర్‌, విశాఖపట్నం, కొచ్చి, ముంబైలోని బీడీఎల్‌ కార్యాలయాలు, యూనిట్లలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు 100 భర్తీ చేయనుంది. హెచ్‌ఆర్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌, కెమికల్‌, ఎలక్ట్రికల్‌, ఫైనాన్స్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి.

- Advertisement -

దరఖాస్తు చేసే అభ్యర్థులకు పోస్టును అనుసరించి బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ అర్హత ఉండాలి. పని అనుభవానికి కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థుల వయస్సు 10-05-2023 నాటికి 28 సంవత్సరాలు మించరాదు. విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు.

- Advertisement -

దరఖాస్తు రుసుం : రూ.300
(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు ఫీజు మినహాయింపు)
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు : 23-06-2023
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన : 05-07-2023
ఇంటర్వ్యూ : జులై రెండో వారం

వెబ్‌సైట్‌ : https://bdl-india.in/

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News