EPAPER

Nokia Jobs Layoffs : ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్.. నోకియాలో భారీగా ఉద్యోగాల కోత

Nokia Jobs Layoffs : ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్.. నోకియాలో భారీగా ఉద్యోగాల కోత

Nokia Jobs Layoffs : ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం వెంటాడుతోంది. ఫలితంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి.. దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రెండేళ్లుగా టెక్,ఐటీ కంపెనీలు దశలవారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొత్తఉద్యోగాల కల్పన కరువై.. ఉన్న ఉద్యోగాలు సైతం పోతుండటంతో ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాజాగా నోకియా కూడా ఇదే బాట పట్టింది. మూడవ త్రైమాసిక ఆదాయాలు క్షీణించిన నేపథ్యంలో.. కంపెనీ ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా 14 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు నోకియా వెల్లడించింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది.


ఫిన్నిష్ టెలీకమ్యూనికేషన్స్ దిగ్గజం “సవాలు ఉన్న మార్కెట్ వాతావరణాన్ని పరిష్కరించడానికి” దాని వ్యయ స్థావరాన్ని తగ్గిస్తుంది. అలాగే ఆపరేషన్ సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొంది. 2023 నుంచి 2026 నాటికి స్థూల ప్రాతిపదికన 800 మిలియన్ యూరోల నుంచి 1.2 బిలియన్ యూరోల మధ్య కాస్ట్ బేస్ ను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో నోకియా ఉద్యోగుల సంఖ్య 86 వేల నుంచి 72-77 వేల మధ్యకు తగ్గిపోనుంది.

నోకియా మూడవ త్రైమాసిక నికర అమ్మకాలు సంవత్సరానికి 20 శాతం క్షీణించి 4.98 బిలియన్ యూరోలకు చేరుకున్నాయని పేర్కొంది. కంపెనీ లాభాల శాతం 69కి తగ్గి.. 133 మిలియన్ యూరోలకు పడిపోయింది. ప్రపంచంలోని అతిపెద్ద టెలీకమ్యూనికేషన్ పరికరాల తయారీదారుల్లో ఒకటైన నోకియా.. మందగిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మొబైల్ ఆపరేటర్లు చేసిన మౌలిక సదుపాయాల ఖర్చుల తగ్గింపులను ఎదుర్కొంటోంది. నోకియాకు సంబంధించిన అమ్మకాలు సంవత్సరానికి 24 శాతం క్షీణించి 2.16 బిలియన్ యూరోలకు తగ్గిపోయాయి. ప్రధానంగా ఉత్తర అమెరికాలో నోకియా అమ్మకాలు తగ్గిపోయినట్లు కంపెనీ యాజమాన్యం పేర్కొంది. 5జీ విస్తరణలు సాధారణంగానే ఉంటాయని వివరించింది.


Related News

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Big Stories

×