Big Stories

Rural Banks : గ్రామీణ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?

Rural Banks : రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ద్వారా 8,612 పోస్టుల భర్తీ కోసం ఐబీపీఎస్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి అభ్యర్థులు బ్యాచిలర్స్‌ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 01-06-2023 నాటికి ఆఫీసర్‌ స్కేల్‌-3 (సీనియర్‌ మేనేజర్‌) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు, ఆఫీసర్‌ స్కేల్‌-2 (మేనేజర్‌) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు, ఆఫీసర్‌ స్కేల్‌-1 (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్‌ రాత పరీక్ష, మెయిన్స్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

- Advertisement -

పోస్టుల వివరాలు..
ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) : 5,538
ఆఫీసర్‌ స్కేల్‌-1 (ఏఎం) : 2,485
జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌ (మేనేజర్‌) స్కేల్‌-2 : 332
ఐటీ ఆఫీసర్‌ స్కేల్‌-2 : 68
సీఏ ఆఫీసర్‌ స్కేల్‌-2 : 21
లా ఆఫీసర్‌ స్కేల్‌-2 : 24
ట్రెజరీ మేనేజర్‌ స్కేల్‌-2 : 08
మార్కెటింగ్‌ ఆఫీసర్‌ స్కేల్‌-2 : 03
అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ స్కేల్‌-2 : 60
ఆఫీసర్‌ స్కేల్‌-3 (సీనియర్‌ మేనేజర్‌) : 73

- Advertisement -

దరఖాస్తు రుసుం : ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.175
( మిగతా వారికి రూ.850)
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, దరఖాస్తు సవరణ : 21-06-2023 వరకు
అప్లికేషన్‌ ఫీజు/ ఇంటిమేషన్‌ ఛార్జీ చెల్లింపు : 21-06-2023 వరకు
ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు
ఆన్‌లైన్‌ మెయిన్స్‌ పరీక్ష : సెప్టెంబర్‌
ఇంటర్వ్యూ తేదీలు (ఆఫీసర్స్‌ స్కేల్‌ 1, 2, 3) : అక్టోబర్‌/ నవంబర్‌

వెబ్‌సైట్‌ : https://www.ibps.in/crp-rrb-xii/

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News