EPAPER

India Post GDS Recruitment 2024: కొలువుల జాతర.. టెన్త్ అర్హతతో పోస్టల్ శాఖలో 44,228 ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలంటే..?

India Post GDS Recruitment 2024: కొలువుల జాతర.. టెన్త్ అర్హతతో పోస్టల్ శాఖలో 44,228 ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలంటే..?

India Post GDS Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్‌లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) 44,228 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


పోస్టుల వివరాలు..

  • బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
  • అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
  • డాక్ సేవక్
    తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల సంఖ్య..
  • ఆంధ్రప్రదేశ్- 1355 పోస్టులు
  • తెలంగాణ – 981 పోస్టులు

విద్యార్హత: అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: పదో అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: టెన్త్ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు నెలకు రూ.12,000 నుంచి రూ. 29,380 వరకు ఉంటుంది.
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు నెలకురూ. 10,000 నుంచిరూ. 24,470 జీతం ఇస్తారు.

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ https:indiapostgdsonline.gov.in/ ఓపెన్ చేయాలి.
  • మీ వ్యక్తిగత వివరాలు, ఈ మెయిల్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
    ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • తర్వాత అప్లై ఆన్‌లైన్ లింక్ పై క్లిక్ చేసి మీ డివిజన్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎంచుకోవాలి.
  • మీ వ్యక్తిగత విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • మీ ఫోటో, సిగ్నేచర్‌లను కూడా అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్తు రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్ అవుట్ భద్రపరుచుకోండి.

Also Read: డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా !

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 2024 జూలై 15.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2024 ఆగస్టు 5.

ఆన్‌లైన్ సవరణ తేదీలు: 2024 ఆగష్టు 6 నుంచి 8 వరకు.

Tags

Related News

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BHEL Jobs 2024: హైదరాబాద్‌లోని భెల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. అర్హతలివే!

Big Stories

×