EPAPER

HAL Recruitment 2024: హెచ్ఏఎల్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే !

HAL Recruitment 2024: హెచ్ఏఎల్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే !

HAL Recruitment 2024:  హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్‌ఏ‌ఎల్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న 25 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


పూర్తి వివరాలు..
ఖాళీల సంఖ్య:  25

1. డిప్లొమా టెక్నీషియన్ D-6:06 పోస్టులు
2. ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్ D-6:17పోస్టులు
3. ఆపరేటర్ C-5:02 పోస్టులు


విభాగాలు:
మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ వర్క్స్, స్ట్రక్చర్, గ్రైండర్ ,ఎలక్ట్రికల్ మొదలైనవి.

అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:  31.7.2024 నాటికి 28 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు గ్రూప్- డి పోస్టులకు రూ. 48,764, గ్రూప్- సి పోస్టులకు 46,796 ఇస్తారు.

పని ప్రదేశాలు:  బెంగళూర్, జామ్ నగర్, గోరఖ్‌పుర్, అంబాలా, భుజ్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

Also Read: సుప్రీంకోర్టులో జూనియర్ అటెండెంట్ ఉద్యోగాలు.. అర్హతలివే

దరఖాస్తు ఫీజు: రూ. 200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌ అప్రెంటిస్‌లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 30.08. 2024.

రాతపరీక్ష: 22.09.2024.

Related News

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BHEL Jobs 2024: హైదరాబాద్‌లోని భెల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. అర్హతలివే!

Big Stories

×