EPAPER

BSF Recruitment: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?

BSF Recruitment: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?

BSF Recruitment: నిరుద్యోగులకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గ్రూప్ బి, సి (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. మెట్రిక్యులేషన్, ఐటీఐ, డిప్లొమా/ డిగ్రీలో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఎస్సై (వెహికల్ మెకానిక్)‌లో మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు డిప్లొమా/డిగ్రీ (ఆటో మొబైల్ ఇంజినీరింగ్ / మెకానికల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 30 ఏళ్లు మించకూడదు. మిగతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్, అవివాహిత వితంతు మహిళలకు వయో సడలింపు ఉంటుంది.

అలాగే కానిస్టేబుల్ (ఫిట్టర్)లో 4 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారు 10వ తరగతి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫకేట్‌తో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. మిగతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్, అవివాహిత వితంతు మహిళలకు వయో సడలింపు కల్పించారు.


Also Read:  ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. పైలట్ పోస్టుల్లో బంపర్ రిక్రూట్ మెంట్

కానిస్టేబుల్ (వెహికిల్‌ మెకానిక్‌)లో మొత్తం 22 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు 10వ తరగతి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్‌తో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండాలి. 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్, అవివాహిత వితంతు మహిళలకు వయో సడలింపు కల్పించారు.

అలాగే మరికొన్ని పోస్టుల గురించి చెప్పుకుంటే.. కానిస్టేబుల్ (ఓటీఆర్‌పీ) 1 పోస్టు, కానిస్టేబుల్ (ఎస్‌కేటీ) 1 పోస్టు, కానిస్టేబుల్ (కార్పెంటర్) 2 పోస్టులు, కానిస్టేబుల్ (ఏఈ) 1 పోస్టు, కానిస్టేబుల్ (బీఎస్‌టీఎస్‌) 2 పోస్టులు, కానిస్టేబుల్ (అప్‌హోల్‌స్టర్‌)లో 1 పోస్టు ఉంది. ఈ పోస్టులకు కూడా 10వ తరగతి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫకేట్‌తో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. మిగతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్, అవివాహిత వితంతు మహిళలకు వయో సడలింపు కల్పించారు.

పోస్టుల బట్టి నెలవారి జీతభత్యాలు నిర్ణయించారు. అయితే ఈ పోస్టుల దరఖాస్తు ఫీజు విషయానికొస్తే.. గ్రూప్-బికి రూ.200 చెల్లించాలి. అలాగే గ్రూప్-సీ కోసం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులను ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్, ఎఫిషియెన్నీ టెస్ట్, ప్రాక్టికల్/ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. అందువల్ల ఈ పోస్టులపై ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 2024 జూన్ 17వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Notification

Application

Website

Tags

Related News

ITBP Recruitment: ఐటీబీపీలో భారీగా ఉద్యోగాలు

Indian Navy Recruitment 2024: డిగ్రీ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

RRC WR Recruitment 2024: టెన్త్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

×