Big Stories

HAL : హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లో అప్రెంటిస్‌ శిక్షణ.. అర్హులు ఎవరంటే..?

HAL : హైదరాబాద్‌ బాలానగర్‌లో ఉన్న హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌.. HAL అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంఎల్‌టీ, బీకాం, బీఎస్సీ విభాగాల్లో ఖాళీలున్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. డిప్లొమా లేదా డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు లేదు.

- Advertisement -

మొత్తం ఖాళీలు : 150
ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ : 74
టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్ ‌: 52
జనరల్‌ స్ట్రీమ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్ ‌: 24
వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ తేదీలు : మే 23, 24, 25

- Advertisement -

178 ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ శిక్షణకు HAL దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏసీ, సీవోపీఏ, ప్లంబర్‌,పెయింటర్‌, డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ వెహికల్‌ మెకానిక్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌- సివిల్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌- మెకానికల్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, వెల్డర్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి. అభ్యర్థులు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణ సాధించాలి.

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ తేదీలు : మే 17, 18, 19

అడ్రస్ : ఆడిటోరియం, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, హెచ్‌ఏఎల్‌ ఏవియానిక్స్‌ డివిజన్‌, బాలానగర్‌, హైదరాబాద్‌

వెబ్‌సైట్‌ : https://hal-india.co.in/

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News