Big Stories

Navy : నేవీలో ఉద్యోగాల భర్తీ.. అర్హులు ఎవరంటే..?

Navy : ఉద్యోగాల భర్తీకి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. మొత్తం 395 ఖాళీలున్నాయి. త్రివిధ దళాల విభాగాల్లో 02-06-2024 నుంచి ప్రారంభమయ్యే 152వ కోర్సులో, అలాగే 114వ ఇండియన్‌ నేవల్‌ అకాడమీ కోర్సులో ప్రవేశాలకు నోటఫికేషన్ విడుదల చేసింది.

- Advertisement -

ఆర్మీ వింగ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించాలి. ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులే దరఖాస్తు చేయాలి.

- Advertisement -

వయో పరిమిత : అభ్యర్థులు 02-01-2005 – 01-01-2008 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటెలిజెన్స్‌- పర్సనాలిటీ టెస్ట్‌, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టు ఆధారంగా
దరఖాస్తు ఫీజు : రూ.100
(ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు)

ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 06-06-2023
ఆన్‌లైన్‌ రాత పరీక్ష: 03-09-2023
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం

వెబ్‌ సైట్‌:https://upsconline.nic.in/

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News