EPAPER

ISIS: మా పిల్లలను చంపి.. మాకే తినిపించారు, అక్కడి భయానక అనుభవాలను బయటపెట్టిన మహిళ

ISIS: మా పిల్లలను చంపి.. మాకే తినిపించారు, అక్కడి భయానక అనుభవాలను బయటపెట్టిన మహిళ

హమాస్ ఉగ్రమూకలను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయడమే లక్ష్యంగా భీకర వైమానిక దాడులకు దిగుతున్న ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ఐసిస్ చెరలో బందీగా ఉన్న ఓ ఇరాక్ యువతిని రక్షించింది. లెబనాన్ లో ఆమెను గుర్తించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించింది. సుమారు దశాబ్దం తర్వాత ఐసిస్ ఉగ్రమూకల బందీ నుంచి విముక్తి పొందిన ఫౌజియా అమీన్ సిడో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా ఐసిస్ ఉగ్రవాదులు ఎంత దారుణంగా వ్యహరిస్తారనే విషయాన్ని ప్రపంచానికి చెప్పింది. బందీలకు  ప్రత్యక్ష నరకం ఎలా చూపిస్తారో వివరించింది.


శిశువులను చంపి వండి పెట్టేవాళ్లు

ఐసిస్ చెరలో ఉన్న బందీలు అత్యంత ఘోరమైన పరిస్థితులను అనుభవించినట్లు సిడో వెల్లడించింది.  తమ తెగకు(యజిదీ) చెందిన శిశువులను చంపి వండి పెట్టేవాళ్లని చెప్పింది. 2014లో సుమారు 200 మంది మహిళలను, పిల్లలను ఐసిస్ ఉగ్రవాదులు అపహరించి బంధించారని చెప్పింది. ఆ బందీలలో తనతో పాటు తన సోదరులు ఉన్నట్లు వెల్లడించింది. అప్పుడు తన వయసు 9 ఏండ్లు ఉన్నట్లు వివరించింది. “ఐసిస్ ఉగ్రవాదులు బందీలను అత్యంత దారుణంగా ట్రీట్ చేసే వాళ్లు. మమ్మల్ని బందీలుగా తీసుకెళ్లిన తర్వాత మూడు రోజులు తినడానికి ఏం ఇవ్వలేదు.  ఆ తర్వాత అన్నం, మాంసం పెట్టారు. అది తింటున్న సమయంలో ఏదో తేడాగా అనిపించింది. తిన్నాక కొద్ది సేపటికి చాలా మంది వాంతులు చేసుకున్నారు. ఆ తర్వాత మాకు అసలు విషయం చెప్పారు. శిశువులను చంపి వండిపెట్టామన్నారు. చిన్నారులను చంపి వండుతున్నప్పుడు తీసిన ఫోటోలను మాకు చూపించారు. మీ పిల్లలను మీరే తిన్నారని చెప్పారు. ఆ సమయంలో ఓ మహిళ కనిపించకుండా పోయిన బిడ్డను గుర్తు చేసుకుని అక్కడిక్కడే చనిపోయింది” అంటూ భయానక విషయాలను వెల్లడించింది.


Read Also: నెతన్యాహు ఇంటిపై డ్రోన్ అటాక్.. ‘ఇరాన్ తొత్తులు పెద్ద తప్పు చేశారు’

సబయా’ గా మార్చి జిహాదీ ఉగ్రవాదులకు అమ్మకం

ఉగ్రవాదులు తమను సుమారు 9 నెలల పాటు అండర్ గ్రౌండ్ జైల్లో ఉంచినట్లు సిడో చెప్పింది. ఆ సమయంలో అపరిశుభ్రమైన నీళ్లు తాగి ఎంతో మంది చిన్నారులు చనిపోయాని వెల్లడించింది. “10 నెలల తర్వాత నా పేరు ‘సబయా’గా మార్చారు. సబయా అనేది అరబిక్ పదం. సబయా అంటే లైంగిక అవసరాల కోసం బందీగా ఉన్న మహిళ. నన్ను సుమారు 5 సార్లు జిహాదీ ఉగ్రవాదులకు అమ్మారు. నరకకూపం నుంచి బయటపడే కొద్ది రోజుల ముందు కూడా నన్ను అమ్మారు. ప్రస్తుతం నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గాజాలో నరకంలా జీవితాన్ని గడిపిన నాకు ఇజ్రాయెల్ ప్రాణబిక్ష పెట్టింది. నా స్వదేశం ఇరాక్ చేరుకోగానే ప్రాణాల మీద మళ్లీ అశ కలిగింది. స్వేచ్ఛా వాయువులు పీల్చాను. కానీ, నా ఇద్దరు పిల్లలు ఐసిస్ చేతిలోనే బందీలుగా ఉన్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Read Also: డైలీ ఒకరికి రూ.8 కోట్లు ఇస్తా.. అమెరికా ఎన్నికల ప్రచారంలో మస్క్ సంచలన ప్రకటన

Related News

Elon Musk 1 Million dollar: డైలీ ఒకరికి రూ.8 కోట్లు ఇస్తా.. అమెరికా ఎన్నికల ప్రచారంలో మస్క్ సంచలన ప్రకటన

Maternity Leave Job Loss: మెటర్నిటి లీవ్ అడిగితే ఉద్యోగం నుంచి తొలగించిన బాస్.. ఆమె చేసిన తప్పేంటంటే..

Netanyahu House Attack: నెత్యన్యాహు ఇంటిపై డ్రోన్ అటాక్.. ‘ఇరాన్ తొత్తులు పెద్ద తప్పు చేశారు’

Gurupatwant Pannun: ‘ఖలీస్తాన్ ఉగ్రవాది’ హత్యాయత్నం కేసులో నిందితుడిగా భారత ఇంటెలిజెన్స్ అధికారి.. అమెరికా ఆరోపణలు

Yahya Sinwar Kamala Harris: ‘యహ్యా సిన్వర్ మృతితో గాజా యుద్ధం ముగిసిపోవాలి’.. ఇజ్రాయెల్‌కు కమలా హారిస్ సూచన

Israel kills Hamas chief: హమాస్‌ అధినేత యాహ్య సిన్వార్ మృతి.. ధృవీకరించిన ఇజ్రాయెల్

Big Stories

×