EPAPER

Kamala Harris vs Barack Obama: సై అంటున్న కమలా.. నై అంటున్న ఒబామా..

Kamala Harris vs Barack Obama: సై అంటున్న కమలా.. నై అంటున్న ఒబామా..

Why has Barack Obama not support Kamala Harris in us elections 2024: కమలా హారిస్‌.. అమెరికాకు కాబోయే అధ్యక్షురాలు ఆమెనా? ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థి కమలానే అని బైడెన్ అనౌన్స్ చేశారు. అమెరికన్ మీడియా కూడా ఇదే విషయాన్ని హైలేట్ చేస్తుంది. కమలా సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే గెలుపు ఆమెదే అంటూ సర్వేలు చెబుతున్నాయి. కానీ ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. ఈ మాట అంటున్నది మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. అవును ఆయన ఎందుకనో కమలా హారిస్‌ విషయంలో అంత పాజిటివ్‌గా లేరు. అయితే ఇప్పటి వరకు ఈ విషయాలే బయటికి వచ్చాయి. కానీ ఇప్పుడు ఆయన హారిస్‌కు మద్దతివ్వకపోవడానికి రీజన్స్ కూడా తెలిశాయి.. అవేంటో చూద్దాం.


ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు.. తరువాత జరిగే ఎలక్షన్స్‌ నుంచి తప్పుకొని అస్త్రసన్యాసం చేసిన బైడెన్‌ చెప్తున్నదేంటి. నా వారసురాలు కమలా హారిసే.. డెమోక్రాట్లతో పాటు.. అమెరికా మొత్తం ఆమెకు మద్దతివ్వాలని రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు కొత్త తరానికి అవకాశం కల్పించాలని.. దానికి ఇదే సమయం అంటూ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు బైడెన్.. కాబట్టి.. మనసా, వాచా కమలాకే తన ఓటు అని వైట్‌ హాస్‌ సాక్షిగా చెప్పేశారు బైడెన్.. ఇది బైడెన్ మాట.. ఇక పార్టీ విషయానికి వస్తే.. కమలా పేరు అధ్యక్ష రేస్‌లోకి ఎక్కగానే ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయనే చెప్పాలి. డెమోక్రాట్లు గెలిచేందుకు అవకాశాలు పెరిగాయని సర్వేలు చెబుతున్నాయి. అంతేకాదు.. ఆమెపై పోటీ చేసే వారి సంఖ్య కూడా తగ్గుతున్నట్టు కొన్ని మీడియా హౌస్‌లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. కానీ.. ఈ పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న ఒబామా మాత్రం హారిస్‌ను అధ్యక్ష అభ్యర్థిగా అంగీకరించడం లేదని టాక్.. ఎందుకు.. ? ఒబామా ఆమెను వ్యతిరేకించడానికి కారణాలేంటి?

కమలా హారిస్‌.. డొనాల్డ్ ట్రంప్‌పై పోటీ చేస్తే ఆమె గెలవలేరు.. ఆమె ఓ అసమర్థురాలు.. మైగ్రెంట్స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పారు. మైగ్రెంట్స్ ఇష్యూను సాల్వ్ చేసే బాధ్యతను ఆమెకు అప్పగించారు. కానీ ఆమె ఒక్కసారి కూడా బార్డర్స్‌ను సందర్శించలేదు. సవాళ్లను ఎదుర్కోవడం ఆమెకు తెలియదు. అధ్యక్ష రేస్‌లో ఉన్నప్పుడు.. చెప్పగలిగేవి.. చెప్పలేనివి.. ఉంటాయి.. ఆమెకు ఆ తేడా తెలియదు. ఇదీ హారిస్‌పై ఒబామాకు ఉన్న ఒపీనియన్‌ అని ప్రచారం జరుగుతుంది. అందుకే ఆమె హారిస్‌కు మద్దతుగా ఇప్పటి వరకు ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరో రీజన్‌ కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే ఒబామా భార్య మిషెల్లీని అధ్యక్ష రేస్‌లో నిలపాలని చూస్తున్నారనేది దాని సారాంశం.


నిజానికి తన భార్యను బరిలోకి దింపాలని ఒబామా చూస్తున్నారని.. అందుకే హారిస్‌కు మద్దతివ్వడం లేదని మరో ప్రచారం.. అయితే ఈ విషయంపై ఒబామా కానీ.. కనీసం మిషెల్లీ కానీ ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు.. ఈ స్టేట్‌మెంట్‌ను చెప్పింది ఎవరో అల్లాటప్పా వ్యక్తి కాదు.. అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్‌ ..దీన్ని కూడా ఏకపక్షంగా కొట్టేయలేం.. ఏదేమైనా ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్న పేరు అయితే కమలా హారిస్.. ఆమె పేరు దాదాపుగా ఫైనల్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాదు ఒబామా కూడా ఆమెకే మద్దతు తెలుపుతారని కూడా డెమోక్రాటిక్ నేతలు చెబుతున్నారు.

Also Read: టర్కీలో ప్రమాదం, రష్యా అందగత్తె బైకర్ టాట్యానా మృతి

ఎందుకంటే కమలా ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. బైడెన్‌ తప్పుకున్నప్పటి నుంచి ఆమెకు విరాళాలు ఇచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్క మూడు రోజు 130 మిలియన్ డాలర్ల డోనేషన్స్‌ను సేకరించారు ఆమె. అండ్‌.. ఇప్పటి వరకు గెలుపు ఎవరిది అని జరుగుతున్న సర్వేలో ట్రంప్‌ను దాటి ముందుకు వెళ్లారు హారిస్.. కాబట్టి.. డెమోక్రాట్లు.. నచ్చినా.. నచ్చకపోయినా ఆమెకే ఓటు వేసే అవకాశం ఎక్కువగా ఉంది.

మరి కమలా హారిస్‌ నిజంగానే బరిలోకి దిగితే ఏం చేయాలి? ఇదే క్వశ్చన్‌కు ఆన్సర్ వెతికే పనిలో పడింది డొనాల్డ్ ట్రంప్‌ పార్టీ.. అంటే రిపబ్లికన్ పార్టీ.. హారిస్‌ పేరు అనౌన్స్ కావడంతో డెమోక్రాట్లలో జోష్ పెరిగింది నిజం. అందుకే రిపబ్లికన్స్‌ అలర్ట్ అయ్యారు.. ఎవ్వరూ కూడా హారిస్‌ విషయంలో నోరు జారవద్దని నేతలకు అలర్ట్ జారీ అయ్యింది. జాత్యాంహకర.. లింగ వివక్ష వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగానే చెప్పింది. కేవలం బైడెన్‌ యంత్రాంగం.. ఆమె వైఫల్యాలను మాత్రమే హైలేట్ చేయాలని చెప్పింది. ఇదే డైరెక్షన్‌లో ట్రంప్‌ అడుగులు వేస్తున్నారు. ఆమెకు పాలనలో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికే విరుచుకపడటం మొదలు పెట్టారు.

ఏదైమైనా ప్రస్తుతం అమెరికా ఎలక్షన్స్‌కు కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. ప్రస్తుతం అధికారికంగా డెమోక్రాట్లు తమ అభ్యర్థిని ప్రకటించడానికి మరో 20 రోజుల సమయం ఉంది. కానీ ఈలోపే పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు హారిస్‌ కూడా తానే అధ్యక్ష అభ్యర్థిని అని డిసైడ్ అయిపోయి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఈ ఆలస్యం ఎవరికి మేలు చేస్తుందో చూడాలి.

Related News

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Big Stories

×