EPAPER

What Will Change If Trump Wins: ట్రంప్ గెలిస్తే.. ప్రపంచంపై ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది?

What Will Change If Trump Wins: ట్రంప్ గెలిస్తే.. ప్రపంచంపై ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది?

What will be the Effect on the World if Trump Wins: డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష రేసులో ప్రస్తుతం ముందున్న నేత.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్వాకమో.. రీసెంట్‌గా జరిగిన హత్యాయత్నమో.. లేదా నిజంగానే ఆయనంటే అభిమానమో.. కారణాలు ఏవైనా.. ట్రంప్‌ గెలిస్తే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తే.. అమెరికా ఎలా మారబోతుంది? ప్రపంచంపై ట్రంప్‌ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? డొనాల్డ్ ట్రంప్‌ ఎన్నికల్లో గెలవగానే మన తెలుగమ్మాయి ఉష చిలుకూరి సెకండ్ లేడీ అవుతుంది. గత వారం రోజులుగా ఇదే టాపిక్‌పై తెగ చర్చ నడుస్తోంది.


ప్రస్తుతమున్న వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఇండియన్ మూలాలున్న మహిళా.. దీని వల్ల మనకేమైనా ఒరిగిందా? ఏమీ లేదు. రేపటిరోజున ఉష చిలుకూరి కూడా సెకండ్ లెడీ అయినా మనకు పెద్ద లాభనష్టాలు ఏమీ ఉండకపోవచ్చు. ఇవన్నీ ఏదో టైమ్ పాస్ ముచ్చట్లు కానీ.. నిజంగా ట్రంప్‌ గెలిస్తే ప్రపంచ వ్యాప్తంగా చాలా పరిణామాలు జరుగుతాయి. ఇప్పుడున్న పరిస్థితులు మారుతాయి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అతని పనితీరును ఇప్పటికీ ప్రపంచ దేశాలు మర్చిపోలేదు. కాబట్టి  ట్రంప్‌ గెలిస్తే.. అనే థాటే కొన్ని దేశాలను కలవరపెడుతోంది.

ఫస్ట్.. ఇంటర్నేషనల్ ట్రేడ్.. రీసేంట్‌గా వరల్డ్ బ్యాంక్‌ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వం అనేది లేదు.. ఇప్పుడీ స్థిరత్వం చాలా అవసరం. కానీ ఈ ఏడాది జరిగే ఎన్నికలు ప్రపంచ ఆర్థిక స్థితిగతులను మార్చే అవకాశం ఉంది. ఇది IMF స్టేట్మెంట్.. యూఎస్‌ పేరు ఎత్తకుండా ఆ దేశ ఎన్నికలను కోట్ చేసింది. అంటే ఈ ఎన్నికలు ఎంత కీలకమో ఈ స్టేట్‌మెంట్‌ని బట్టి అర్థమవుతుంది. దీనికి కారణం డొనాల్డ్ ట్రంప్.. ఎందుకంటే ట్రంప్‌ది అమెరికా ఫస్ట్ పాలసీ నేను రూపాయి సాయం చేస్తే… నువ్వు కూడా అంతే సాయం చేయాలంటారు.


అనవసరంగా అమెరికన్ ప్రజల డబ్బును దుర్వినియోగం చేసేది లేదంటారు ఆయన. అందుకే అమెరికా ఇంపోర్ట్స్‌పై 10 శాతం ట్యాక్స్‌ విధించే అవకాశం ఉంది. దీన్ని బట్టి అమెరికాకు ఎగుమతులు చేసే దేశాలకు కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశాన్నే తీసుకోండి. మనం 120 బిలియన్ డాలర్ల విలువైన వస్తు, సేవలను ఎక్స్‌పోర్ట్ చేస్తాం అమెరికాకి. ఇది ఇంప్లిమెంట్ అయితే మన ఎక్స్‌పోర్ట్స్‌పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ ఇండియా.. అనేక దేశాలు అమెరికాకు భారీగా ఎక్స్‌పోర్ట్స్ చేస్తాయి. ఇప్పుడు ఇవీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది.

తరువాత పర్యావరణం.. మారుతున్న వాతావరణ పరిస్థితులు.. కాలుష్యాన్ని తగ్గించే టెక్నాలజీని అందించాలన్న డిమాండ్‌ను ట్రంప్‌ ఎప్పుడూ పట్టించుకోలేదు. అంతేకాదు ఈ అంశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు లెవనెత్తితే.. దీనిని ఓ దోపిడిగా అభివర్ణించారు. పారిస్‌ ఒప్పందాన్ని కూడా పట్టించుకోలేదు. చైనా, భారత్‌ లాంటి దేశాలకు టెక్నాలజీ, నిధులను ఇచ్చేందుకు నిరాకరించారు. ఇప్పుడు ట్రంప్‌ మరోసారి అధ్యక్షుడైతే.. ఈ విషయాలన్ని అటకెక్కినట్టే. అయితే బొగ్గు, ముడి చమురు వంటి ఇంధనాల అన్వేషణకు మాత్రం ట్రంప్ సపోర్ట్ చేశారు. దీనిపై ప్రపంచ దేశాల నుంచి వచ్చిన విమర్శలను కూడా అప్పట్లో ఆయన పట్టించుకోలేదు.

ట్రంప్‌ ఎఫెక్ట్ ఏసియన్ కంట్రీస్‌పై ఎలా ఉండబోతుంది? ఇది మాత్రం కాస్త నెగటివ్ అనే చెప్పాలి. ఎందుకంటే అమెరికాపై ప్రస్తుతం కొన్ని దేశాలు ఆధారపడి ఉన్నాయి. అందులో ఫస్ట్‌ ఉన్న పేరు తైవాన్. తైవాన్‌పై ఎప్పుడెప్పుడు దురాక్రమణ చేద్దామా అని ఎదురుచూస్తోంది చైనా.. నిజానికి ఇండియాకు అమెరికాకు అంత సపోర్ట్ చేయడానికి చైనానే కారణం. ఇక సౌత్ కొరియా, జపాన్‌లలో కూడా అమెరికా మిలటరీ ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ మెయింటనేన్స్‌ కోసం బిలియన్ల కొద్ది డాలర్లను కుమ్మరిస్తోంది. అయితే ఇకపై అలా నడిచే అవకాశం లేదు. తైవాన్‌ విషయంలో ఆయన వైఖరి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. ఇక సౌత్ కొరియా, జపాన్‌ విషయంలో అయితే ఆయన అంత పాజిటివ్‌గా ఉండే అవకాశం లేదు. అమెరికా వల్ల ఈ రెండు దేశాలకు లాభమే కానీ.. వాటి వల్ల అమెరికాకు ఎలాంటి లాభం లేదన్నది ఆయన ఫీలింగ్. సో.. ఏసియా ఏరియాలో ఉన్న అమెరికన్ బలగాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది..

తరువాత రష్యా-ఉక్రెయిన్ వార్.. ఈ విషయంలో మాత్రం ఉక్రెయిన్‌కు గడ్డు పరిస్థితులే అని చెప్పాలి. ఎందుకంటే.. ఈ యుద్ధంతో అమెరికాకు నయాపైస లాభం లేదన్నది ఆయన అభిప్రాయం. అంతేకాదు ట్రంప్‌కు రష్యాపై కొంచెం సాఫ్ట్ కార్నర్‌ ఉన్నట్టు కనిపిస్తోంది. మొన్న మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు కూడా రష్యా ట్రంప్‌కు మద్ధతుగా నిలిచింది. అంతేకాదు ట్రంప్‌ గెలిచేందుకు రష్యా సపోర్ట్ ఉంటుందని ఎప్పటి నుంచో ఉన్న ప్రచారం. ఈ భయాలు ఉక్రెయిన్‌లో కూడా ఉన్నాయి. ట్రంప్‌ గెలిస్తే తమకు కొన్ని కష్టాలు తప్పవని ఏకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ కూడా డైరెక్ట్‌గానే చెబుతున్నారు.

Also Read: హైతీలో దారుణం, అగ్ని ప్రమాదానికి గురైన వలసదారుల బోటు

ఇజ్రాయెల్-హమాస్ యుద్దం.. ఈ విషయంలో మాత్రం ఇజ్రాయిల్‌కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ట్రంప్. రీసెంట్‌గా జరిగిన డిబెట్‌లో కూడా ఇరువురు అభ్యర్థులు ఇజ్రాయిల్‌కు ఫుల్ సపోర్ట్ చేశారు. దీనిని బట్టి ఇజ్రాయిల్‌కు ఎలాంటి టెన్షన్‌ అవసరం లేదని తెలుస్తుంది. రష్యాతో మాత్రమే కాదు.. అమెరికా బద్ధ శత్రువైన ఉత్తర కొరియాతో కూడా సంబంధాలు మెరుగుపడేఅవకాశం ఉంది. ఎందుకంటే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్‌తో ట్రంప్‌ రెండు సార్లు చర్చలు జరిపారు. మరి ఈసారి గెలిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి.

ఇక మన దేశ విషయానికి వస్తే.. భారత్ -అమెరికా సంబంధాలు కొన్ని ఒడిదుడుకులకు గురైనా బాగానే కొనసాగుతాయి. ఇక మోడీ-ట్రంప్‌ మధ్య మంచి అనుబంధమే ఉంది. అలానే భారత్-రష్యా దోస్తిపై చూసి చూడనట్టు ఉండే ధోరణే కొనసాగుతుంది. అంటే ఇవన్నీ ఇలానే జరుగుతాయని కాదు. కానీ జరిగే చాన్స్‌ మాత్రం ఎక్కువగా ఉంది. ఇవన్నీ జరగాలంటే ట్రంప్‌ మళ్లీ గెలవాలి. అసలు అది జరుగుతుందో లేదో చూడాలి ముందు.. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే.. అఫ్ఘనిస్థాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ.
ఆయన హయాంలోనే దీనికి బీజం పడింది.

Related News

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Big Stories

×