EPAPER
Kirrak Couples Episode 1

Israel vs Iran War: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?

Israel vs Iran War: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?

Israel vs Iran War: మొదట పేజర్లు పేలాయి.. ఆ తర్వాత వాకీటాకీలు.. ఇప్పుడేమో రాకెట్‌ లాంచింగ్ సైట్స్ ధ్వంసమయ్యాయి. మరి నెక్ట్స్‌ ఏంటి? ఇజ్రాయెల్ ఇలాంటి అటాక్స్‌ ఎందుకు చేస్తోంది? అమెరికా ఎందుకు హై అలర్ట్ ప్రకటించింది? హెజ్బుల్లా శపథాలు చేస్తుంటే ఇజ్రాయెల్‌ పని కానిచ్చేస్తుందా? అసలు మిడిల్‌ ఈస్ట్‌లో ఈ ఉద్రిక్తలకు కారణాలేంటి?


ఇజ్రాయెల్‌ హెజ్బుల్లా మధ్య ఏం జరుగుతుందో మనకి తెలుసు. కానీ ఎందుకు జరుగుతుందన్నది మాత్రం చాలా మందికి తెలియదు. ఇప్పుడు దానిపైనే మన చర్చ.
మీకు గుర్తుందా చాలా రోజుల క్రితం హెజ్బుల్లా చీఫ్‌ కమాండర్‌ను ఇజ్రాయెల్‌ మట్టుపెట్టింది. ఈ సీన్ తర్వాత ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తామని హెజ్బుల్లా ప్రకటించింది.
ఆ తర్వాత ఇరాన్‌ నడిబొడ్డున హమాస్‌ పొలిటికల్ వింగ్ చీఫ్‌ ఇస్మాయిల్ హనియా మర్డర్‌ జరిగింది. ఈ హత్య తరువాత ఇరాన్‌ ఇజ్రాయెల్‌ అంతు తేలుస్తామని ప్రతిజ్ఞ చేసింది. దానికి తగ్గట్టుగానే చరిత్రలోనే తొలిసారి ఇజ్రాయెల్‌పై నేరుగా అటాక్ చేసింది. అది ఆరంభం మాత్రమే అని చెప్పింది. ఇరాన్‌ కనుసన్నల్లోనే హెజ్బుల్లా పనిచేస్తుందని అందరికి తెలిసిందే. అయితే రీసెంట్‌గా లెబనాన్‌లో చాలా అప్‌డేట్స్‌ జరుగుతున్నాయి. వీటన్నింటినీ ఓ కంట కనిపెడుతోంది ఇజ్రాయెల్. అందుకే దాడి జరగడానికి ముందే అటాక్ చేసేసింది.

ఇజ్రాయెల్‌ దాడులు ఒక ఆర్డర్‌లో జరిగాయి. మొదట.. ఇరాన్‌ నుంచి ఓ భారీ వెపన్‌, ఎక్స్‌ప్లోజివ్స్‌ కన్‌సైన్‌మెంట్‌ లెబనాన్‌కు వచ్చింది. వాటన్నింటినీ రహస్య ప్రాంతంలో ఉంచారు. అంతుకుముందే తమ వద్ద లక్ష రాకెట్లు సిద్ధంగా ఉన్నాయని గొప్పగా ప్రకటించింది హెజ్బుల్లా. ఇదే సమయంలో గాజాలోని కొన్ని ప్రాంతాల నుంచి తమ దళాలను వెనక్కి పిలిపించింది ఇజ్రాయెల్. ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ కాస్త వెనక్కి తగ్గింది అనుకుంది. కానీ.. అసలు ప్లాన్‌ వేరే ఉందని అప్పుడూ ఎవరూ ఊహించలేకపోయారు. ఫస్ట్‌.. హెజ్బుల్లా అత్యంత రహస్యంగా దాచిన ఆయుధాల గోడౌన్‌పై ఇజ్రాయెల్‌ ఎయిర్‌ఫోర్స్‌ విరుచుకపడింది. దెబ్బకు మొత్తం నాశనం అయ్యింది.
ఇది హెజ్బుల్లాకు ఫస్ట్ ఊహించని షాక్.


సెకండ్ పేజర్ అటాక్..

గోడౌన్‌పై జరిగిన దాడి తర్వాత కమ్యూనికేషన్స్‌ మొత్తం మార్చేసింది హెజ్బుల్లా. సెల్‌ఫోన్స్‌ను ఇజ్రాయెల్‌ ట్రాక్‌ చేస్తుందని గమనించి పేజర్లకు షిఫ్ట్ అయ్యింది. తమ కొరియర్లందరికి పేజర్లు ఇచ్చింది. దీనిని డీకోడ్‌ చేసి.. ఆ పేజర్లలో ఎక్స్‌ప్లోజివ్స్‌ పెట్టి పేల్చేసింది ఇజ్రాయెల్. దాదాపు 3 వేల మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ ప్రతివారు హెజ్బుల్లా కోసం పనిచేసేవారే అని తెలుస్తోంది. ఆ తర్వాత వాకీటాకీలు. కొరియర్ల కంటే పైస్థాయిలో ఉన్నవారు వాకీటాకీలు ఉపయోగిస్తున్నారు. అవి కూడా పేలాయి. మరో మూడు వేల మంది వరకు గాయపడ్డారు.

అక్కడితో ఆగిందా అంటే లేదు. మరోసారి ఇజ్రాయెల్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఫైటర్‌ జెట్స్ మళ్లీ గాల్లోకి లేచాయి. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉన్న వంద రాకెట్ లాంచ్‌ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దాదాపు వేల సంఖ్యలో రాకెట్లను నాశనం అయ్యాయి. అయితే హెజ్బుల్లా వద్ద ఇంక వేలాది రాకెట్స్ ఉన్నాయి.

వీటన్నింటినీ చూస్తే ఏం అర్థమవుతోంది. మొదట ఆయుధాలను లేకుండా చేశారు. నెక్ట్స్‌ కొరియర్లకు షాకిచ్చారు.. ఆ తర్వాత హెజ్బుల్లా ఫైటర్స్‌ను గాయపరిచారు. ప్రస్తుతం హెజ్బుల్లా వద్ద ఇంకా భారీగా ఆయుధాలు ఉన్నాయి. కానీ.. వారి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్‌ వ్యవస్థ అనేది లేకుండా చేశారు. ఒకరితో ఒకరు ఎలా కమ్యూనికేట్‌ అవ్వాలనేది కూడా వారికి అర్థం కాని పరిస్థితి. ఏం చేస్తే ఏం జరుగుతుందో అని భయం వారిలో మొదలైంది.

Also Read: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

అయితే హెజ్బుల్లా చూస్తూ ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. ఇప్పటికే ఇజ్రాయెల్‌పై భారీ దాడి తప్పదని.. మరోసారి ప్రతిజ్ఞ చేసింది. ఇలాంటి స్టేట్‌మెంట్స్‌ వచ్చిన ప్రతిసారీ ఇజ్రాయెల్‌ దాడుల తీవ్రతను పెంచుతుంది. చావుదెబ్బ తీస్తోంది. వాళ్లు ప్రకటనలు, వార్నింగ్‌లు, ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటే.. ఇజ్రాయెల్‌ సైలెంట్‌గా పనిచేస్తూ పోతుంది.
అయితే ఈ సీరిస్ ఆఫ్‌ అటాక్స్‌కు ఎండ్ కార్డ్‌ పడిందా? అంటే ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. అన్నీ సర్‌ప్రైజ్‌ అటాక్సే.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి.

అక్టోబర్ 7 అటాక్‌ తర్వాత ఇజ్రాయెల్ ఎలాంటి ఛాన్స్‌ తీసుకోవడం లేదు. తమకు థ్రెట్ ఉందని అనుమానం వస్తే చాలు.. అటాక్‌ చేస్తూనే ఉంది. చర్చలు చర్చలే.. దాడులు దాడులే అంటోంది. తమ అస్తిత్వం కాపాడుకోవడానికి దేనికైనా తెగిస్తాం.. ఎవరినైనా ఎదిరిస్తాం అనే ఫార్ములాని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి ఈ దాడులు అమెరికాకు చెప్పి చేస్తుందో లేదో తెలియదు కానీ.. ఇజ్రాయెల్‌కు అయితే అమెరికా సపోర్ట్ ఫుల్‌గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏడాది నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతుగా వేలాది సైన్యం, అరబ్‌ దేశాల సముద్ర తీరాల్లో క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ కాచుకొని ఉన్నాయి. నిన్నటి దాడుల తర్వాత కూడా అమెరికన్ ఆర్మీ హైఅలర్ట్ ప్రకటించింది. ఎలాంటి దాడులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.

ప్రస్తుతం లెబనాన్, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో పరిస్థితి ఏంటో తెలుసా.. ? సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో అయితే బాంబ్‌ షెల్టర్‌లకు సమీపంలో ఉండాలని ప్రజలకు ఆదేశాలిచ్చారు. ఎక్కువగా ప్రజలు గుమికూడి ఉండకూడదని.. బయట ఎక్కువ తిరగవద్దని సూచించారు. కాబట్టి.. లెబనాన్‌ నుంచి కౌంటర్‌ అటాక్‌ను ఎక్స్‌పెక్ట్‌ చేస్తోంది ఇజ్రాయెల్. మరోవైపు లెబనాన్‌ మాత్రం ఇజ్రాయెల్‌పై మండిపడుతోంది. తమ దేశంపై దాడులు చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Big Stories

×