EPAPER

Kamala Harris | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ దాఖల చేసిన కమలా హ్యారిస్.. ట్రంప్‌ను ఢీకొట్టేందుకు రెడీ అంటూ ప్రకటన

Kamala Harris | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ దాఖల చేసిన కమలా హ్యారిస్.. ట్రంప్‌ను ఢీకొట్టేందుకు రెడీ అంటూ ప్రకటన

Kamala Harris nomination for elections(Today news paper telugu):  అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్.. నవంబర్ లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్స్ అభ్యర్థిగా శుక్రవారం జూలై 26న నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు కష్టపడి పనిచేస్తానని.. అమెరికాలోని ప్రతి ఒక్కరి ఓటు సంపాదించడానికి తన వంతు కృషి చేస్తానని అమె అన్నారు.


ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ఎక్స్ లో ట్వీట్ ద్వారా తెలిపారు. ” నేను ఈ రోజు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశాను. దేశంలోని ప్రతి ఒక్కరి ఓటు సంపాదించేందుకు కష్టపడి పని చేస్తాను. నవంబర్ లో ప్రజలు బలపరచిన అభ్యర్థి మాత్రమే విజయం సాధించాలి,” అని తన ట్వీట్ లో రాశారు. కమలా హ్యారిస్ కంటే ముందు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. కానీ ఆయనకు సొంతపార్టీ తరపునే వ్యతిరేకం రావడంతో బైడెన్ తాను ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత తన స్థానంలో డెమోక్రాట్స్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీ చేయాలని సూచించారు. కమలా హ్యారిస్ ఒక మంచి వైస్ ప్రెసిడెంట్ గా సేవలందించారని ప్రశంసించారు.

Also Read: పారిస్ రైలు నెట్‌వర్క్ ధ్వంసం చేసిన దుండగులు.. ట్రైన్ లో చిక్కుకున్న ఒలింపిక్స్ క్రీడాకారులు!


బైడెన్ నుంచి పూర్తి మద్దతున్న కమలా హ్యారిస్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచేల్ ఒబామా కూడా తమ మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని బరాక్ ఒబామా శుక్రవారం బహిరంగంగానే తెలిపారు. ఒబామా భార్య మిచేల్ ఒబామా కూడా కమలా హ్యారిస్ విజయం కోసం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు హాలీవుడ్ నటుడు, డెమోక్రాట్స్ పార్టీ సభ్యుడు జార్జ్ క్లూనీ కూడా కమలా హ్యారిస్ తన మద్దతు తెలిపారు.

ఈ ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థిగా రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ట్రంప్ గతంలో రెండు సార్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా పోటీ చేశారు.

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×