EPAPER

US Green Card: ‘అమెరికాకు రావొద్దు.. గ్రీన్ కార్డ్ కోసం 100 ఏళ్లు వెయిట్ చేయాలి’.. ఇండియన్ టెకీ హెచ్చరిక!

US Green Card: ‘అమెరికాకు రావొద్దు.. గ్రీన్ కార్డ్ కోసం 100 ఏళ్లు వెయిట్ చేయాలి’.. ఇండియన్ టెకీ హెచ్చరిక!

US Green Card Nightmare: లక్షల జీతం సంపాదిస్తూ అమెరికాలో సెటిల్ కావాలని వెళ్లే భారతీయ విద్యార్థులు చదువులు పూర్తిచేసుకొని నిరుద్యోగులుగా మారుతున్నారు. వీరిలో కొంతమంది ఉద్యోగం లేక ఇండియాలో తల్లిదండ్రుల వద్ద నుంచి ఖర్చుల కోసం డబ్బులు తెప్పించుకొని కాలం గడుపుతున్నారు. చాలామంది అయితే అసలు ఇంటి రెంటు చెల్లించలేక రోడ్లపై నివసిస్తున్న దీని స్థితిలో ఉన్నారు. గ్రీన్ కార్డు దొరికితే తమ జీవితాలు మారిపోతాయని భావించేవారికి చేదు అనుభవమే ఎదురవుతోంది.


ఈ పరిస్థితులన్నీ వివరిస్తూ.. అమెరికాలోని టెక్సాస్ లో నివసిస్తున్న సురేన్ అనే ఒక ఇండియన్ అమెరికన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. సురేన్ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అమెరికాలో గ్రీన్ కార్డు
పొందితే శాశ్వతంగా అక్కడే ఉండిపోవచ్చే వారు.. గ్రీన్ కార్డు పొందడానికి 100 ఏళ్ల వరకు ఎదురు చూసినా అది లభించడం కష్టమని సురేన్ చెప్పాడు. అమెరికాలో ఉన్నత చదువులు కోసం వచ్చే విద్యార్థులు, ఉద్యోగాలు పొందాలని వచ్చే యువతకు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని చెప్పాడు.

సురేన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అమెరికాలో హెచ్ వన్ బి వీసా పొందడం అంత సులభం కాదని.. ఏళ్ల తరబడి ఎదురుచూసినా చాలా తక్కువ మందికి మాత్రమే లభిస్తోందని సురేన్ రాశాడు. మరోవైపు అమెరికా అధికారులు.. గ్రీన్ కార్డు, హెచ్ వన్ బీ వీసాలతో అమెరికాలోనే స్థిరపడవచ్చని బంగారు కలలు చూపించి విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శలు చేశాడు.


గ్రీన్ కార్డ్ అంటే అమెరికా శాశ్వత రెసిడింట్ కార్డు. ఈ కార్డు లభిస్తే.. అమెరికాలో శాశ్వతంగా నివసించే అనుమతి లభించినట్లే. గ్రీన్ కార్డు లభించగానే అక్కడే ఉద్యోగం చేసుకుంటూ.. ఆ తరువాత పౌరసత్వం కోసం ప్రయత్నించవచ్చు. అయితే ఆ గ్రీన్ కార్డ్ పొందడానికి చాలా కఠిన నిబంధనలున్నాయి. అమెరికా గ్రీన్ కార్డు కోసం ఎక్కువగా ప్రయత్నించేవారిలో భారతీయులుండడం గమనార్హం.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

అమెరికా ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ అజయ్ శర్మ మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం ఇండియా నుంచి 6 లక్షల, 75 వేల మంది గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. అందులోను లక్ష 40 వేల మంది అప్లికేషన్లు మాత్రమే స్వీకరించబడతాయి. 2024లో ఇప్పటివరకు దాదాపు 3 కోట్ల 47 లక్షల మంది గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్నారు. నిబంధనల ప్రకారం.. వీరికి రాబోయే 50 ఏళ్లో గ్రీన్ కార్డ్ లభించే అవకాశం ఉంది. గ్రీన్ కార్డ్ నిబంధనలలో మొత్తం అప్లికేషన్లలో ఒక దేశం నుంచి అత్యధికంగా 7 శాతం అప్లికేషన్లు మాత్రమే స్వీకరిస్తారు. దీని వల్ల అమెరికా భారీ సంఖ్యలో ఉన్న భారతీయులు కష్టాలు పడుతున్నారు. పైగా గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ఒక కంపెనీ స్పాన్సర్ గా ఉండాలి, లేదా వారి కుటంబంలో ఒకరికి గ్రీన్ కార్డు ఉండాలి. ఈ వీసా పాలసీలలో నిరంతరం ప్రభుత్వం మార్పులు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి పది లక్షల భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. దీని వల్ల వారికి ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు ఎదురవుతున్నాయి.

Also Read: బంగ్లాదేశ్‌లో ఉద్దేశపూర్యకంగానే హిందువులను టార్గెట్ చేస్తున్నారు: రిపబ్లకన్ వివేక రామస్వామి

Related News

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

Big Stories

×