EPAPER

US Travel Advisory: ఇండియాకు ప్రయాణం చేయవద్దు ప్రమాదం.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన అమెరికా!

US Travel Advisory: ఇండియాకు ప్రయాణం చేయవద్దు ప్రమాదం.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన అమెరికా!

US Travel advisory for India tour(International news in telugu): భారతదేశం లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని.. ఆ ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లకూడదని అమెరికా ప్రభుత్వం తన దేశ పౌరులకు బుధవారం ప్రయాణ హెచ్చరిక (ట్రావెల్ అడ్వైజరీ) జారీ చేసింది. ముఖ్యంగా భారతదేశంలోని ఉగ్రవాదం, నక్సలైట్ల ఘటనలు జరుగుతున్న మణిపూర్, జమ్ము కశ్మీర్, ఇండియా – పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు, నక్సలైట్ల ప్రభావం ఉన్న ప్రాంతాలకు ప్రయాణం మానుకోవాలని సూచించింది.


ఇండియాకు ప్రయాణించే వారికి లెవెల్ 2, లెవెల 4 హెచ్చరిక
ప్రయాణికులకు భారతదేశం లెవెల్ 2 ను సూచిస్తూ.. అమెరికా ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలో ఇండియాకు ప్రయాణం చేయడం సురక్షితమే అయినప్పటికీ.. లెవెల్ 4 ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, ఇండియా – పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాద ఘటనలు జరుతున్నాయి. అలాగే మణిపూర్, ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న అంతర్యుద్ధం.. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ ప్రాంతాలలో నక్సలైట్లతో ఎన్ కౌంటర్ ఘటనలు చూపుతూ ఈ ప్రాంతాలకు అమెరికా ప్రభుత్వం లెవెల్ 4 రేటింగ్ ఇచ్చింది.

జమ్మూ కశ్మీర్ లోని తూర్పు లదాఖ్ ప్రాంతం తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయని , ఇండియా – పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల దూరం వరకు భారత సైన్యం, ఉగ్రవాదులతో పోరాడుతోందని తెలుపుతూ అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.


ఇండియాలో అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయని భారత దేశంలో పర్యటించే విదేశీ పర్యాటకులపై అత్యాచారం జరిగిన ఘటనలను చూపుతూ.. ఉగ్రవాదులు విదేశీ పౌరులపై కూడా దాడి చేస్తారని స్టేట్ డిపార్ట్ మెంట్ హెచ్చరించింది. టూరిస్టులు తిరిగే ప్రాంతాలు, మార్కెట్, షాపింగ్ మాల్స్, రైల్వే , బస్ ప్రయాణ స్టేషన్లపై ఉగ్రవాదులు దాడి చేసే ప్రమాదముందని చెప్పింది.

ఇండియాలోని అటవి, గ్రామాల్లో ప్రమాదం జరిగితే.. అమెరికా కాపాడలేదు
అమెరికా పౌరులు ఏ దేశంలో నైనా ప్రమాదాని గురైతే వారిని కాపాడడానికి అమెరికా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కానీ మణిపూర్, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో అటవి, గ్రామీణ ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ ప్రాంతాల్లో వెళ్లడానికి అమెరికన్లు అనుమతులు లేవని తెలిపింది.

ముఖ్యంగా మణిపూర్, కశ్మీర్ లోని శ్రీనగర్, గుల్మార్గ్, పహల్ గామ్ .. అత్యంత ప్రమాదకర ప్రాంతాలని పేర్కొంది. ఇలాంటి ప్రాంతాలకు వెళ్లి ప్రమాదంలో పడితే.. అక్కడికి అమెరికా సహాయక చర్యలు చేపట్లలేదని హెచ్చరించింది.

ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో పర్యటించేందుకు అనుమతులున్నా.. అక్కడ అటారి, వాగా బార్డర్ వద్ద ప్రయాణించే సమయంలో జాగ్రత్త వహించాలని సూచించింది.

Also Read: మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్స్ లిస్ట్ టాప్‌లో సింగపూర్, మరి ఇండియా ?

తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, బెంగాల్ పశ్చిమ ప్రాంతం, దక్షిణ ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, బిహార్ ప్రాంతాల్లో నక్సలైట్లు, మావోయిస్టలు హింసాత్మక దాడులు చేస్తున్నారని.. ఇలాంటి ప్రదేశాలకు అసలు వెళ్లవద్దని తెలిపింది.

 

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×