EPAPER

Kimberly Cheatle| ట్రంప్ హత్యాయత్నం.. భద్రతా వైఫల్యం విమర్శలతో అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రాజీనామా!

Kimberly Cheatle| ట్రంప్ హత్యాయత్నం.. భద్రతా వైఫల్యం విమర్శలతో అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రాజీనామా!

Kimberly Cheatle resignation(Today’s international news): అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటిల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. కొన్ని రోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి.


అయితే అమెరికాలో అధ్యక్షులకు, మాజీ అధ్యక్షులకు భద్రతనందించే బాధ్యతలు ఆ దేశ సీక్రెట్ సర్వీస్ విభాగం నిర్వర్తిస్తుంది. ట్రంప్ పై జరిగిన దాడి ఘటన తరువాత సీక్రెట్ సర్వీస్ పనితీరుపై ప్రజలు, మీడియా నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ప్రభుత్వం, ప్రతిపక్షం ఇరు వైపుల నుంచి సీక్రెట్ సర్వీస్ ఇంత పెద్ద స్థాయిలో ఎలా విఫలమైందని.. అసలా షూటర్ ట్రంప్ ప్రచార కార్యక్రమానికి అంత సమీపంలో నుంచి ఎలా కాల్పులు జరిపాడని ప్రతి రోజు మీడియా ఛానెళ్లలో అక్కడ సీక్రటె సర్వీస్ పనీతీరుని ఏకిపారేస్తున్నారు.

నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఆయన జూలై 13న పెన్సిల్వేనియాలో ప్రచార కార్యక్రమం సందర్భంగా స్టేజిపై ప్రసంగం చేస్తుండగా.. ఆయనను హత్య చేయడానికి ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి బుల్లెట్ తగడంతో ఆయనకు రక్తస్రవమైంది. బుల్లెట్ ఆయన చెవికి తగిలి వెనుక ఉన్న వ్యక్తి గుండెల్లో తగలడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఆ కార్యక్రమానికి హాజరైన జనంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యయి. కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా బలగాలు కాల్చి చంపినా ఇంతవరకూ అతను ఎందుకు దాడి చేశాడో.. అతని వెనుక ఎవరైనా రాజకీయ నాయకులు లేదా మాఫియా ఉన్నదా.. అనే ప్రశ్నకు పోలీసుల విచారణలో సమాధానం లభించలేదు.


Also Read: చేతన సంచలన కామెంట్స్.. భారతీయ పురుషులకు రొమాన్స్ అంటే తెలీదు..

కింబర్లీ చీటిల్ రాజీనామా
ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం కేసులో అమెరికా పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ రెప్రెజెంటేటివ్స్ సోమవారం ఒక ఎంక్వైరీ కార్యక్రమం నిర్వహించింది. ఈ ఎంక్వైరీలో ముఖ్యంగా అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటిల్ పై ట్రంప్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ప్లాన్ చేశారు, ఓ వ్యక్తి భద్రతా వలయాన్ని దాటి అంత సమీపంలో నుంచి ఎలా కాల్పులు జరిపాడు అని అధికార, ప్రతిపక్ష పార్టీల సెనేటర్లు కింబర్లీపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆమె వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నిరాకరించింది. దీంతో రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల నాయకులంతా ఆమెను రాజీనామా చేయమని ఒత్తిడి చేశారు.

2022 నుంచి సీక్రెట్ సర్వీస్ విభాగానికి డైరెక్టర్ గా కింబర్లీ చీటిల్‌ని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. అమె గత 27 ఏళ్లుగా ఇదే విభాగంలో పలు కీలక పదవులలో పనిచేశారు. ట్రంప్ హత్యాయత్నం కేసులో భద్రతా వైఫల్యం జరగడానికి పూర్తి బాధ్యతలు వహిస్తున్నట్లు అంగీకరించారు. 1981లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ని ఇలాగే దాడి చేసి హత్య చేశారు. ఆ తరువాత ట్రంప్ లాంటి మాజీ అధ్యక్షుడిపై ఈ స్థాయి హత్యాయత్నం జరిగింది. సీక్రెట్ సర్వీస్ విభాగం మరిన్ని విచారణ కమిటీలను ఎదుర్కోవాల్సి ఉంది. అమెరికా అతిపెద్ద భద్రతా సంస్థ హోం ల్యాండ్ సెక్యూరిటీ కూడా ట్రంప్ కేసులో పనిచేసిన సీక్రెట్ సర్వీస్ అధికారులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తోంది.

గతంలో కూడా సీక్రెట్ సర్వీస్ అధికారులపై పలుమార్లు తీవ్ర ఆరోపణు వచ్చాయి. 2012లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా కొలంబియా పర్యటనపై ఉన్నప్పుడు సీక్రెట్ సర్వీస్ అధికారులు హోటళ్లకు ప్రాస్టిట్యూట్స్‌ను తీసుకువచ్చారని, ఆ తరువాత 2021లో ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోవడంతో రాజధాని వాషింగ్టన్ ‌లో జరిగిన అల్లర్లలో సీక్రెట్ సర్వీస్ అధికారులు కూడా కుట్ర చేశారనే తీవ్ర ఆరోపణలున్నాయి.

Related News

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Big Stories

×