EPAPER

Vivek Ramaswamy: బంగ్లాదేశ్‌లో ఉద్దేశపూర్యకంగానే హిందువులను టార్గెట్ చేస్తున్నారు: రిపబ్లకన్ వివేక రామస్వామి

Vivek Ramaswamy: బంగ్లాదేశ్‌లో ఉద్దేశపూర్యకంగానే హిందువులను టార్గెట్ చేస్తున్నారు: రిపబ్లకన్ వివేక రామస్వామి

Vivek Ramaswamy| బంగ్లాదేశ్ లో హిందువులు, మైనారిటీలపై ఉద్దేశపూర్వకంగానే దాడులు జరుగుతున్నాయని అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన వివేక్ రామస్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో ప్రధాన మంత్రి షేక్ హసీనాను మిలిటరీ బలపూర్వకంగా పదవి నుంచి తొలగించి ఆమెను దేశ బహిష్కరణ చేసింది. ఆ తరువాత బంగ్లాదేశ్ లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో హిందువులు, దేవాలయాలు, క్రిస్టియన్లు, బౌద్ధులపై దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ లో హిందువలపై జరుగుతున్న దాడుల గురించ ప్రస్తావిస్తూ రామస్వామి సమస్యకు అసలు కారణం ప్రభుత్వ ఉద్యోగాల కోటా విధానంలో ఉన్న లోపాలని చెప్పారు. భారత మూలాలున్న రామస్వామి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీచేసేందుకు ప్రయత్నించి.. ఆ తరువాత విరమించుకున్నారు. ప్రస్తుతం ఆయన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు మద్దతు ప్రకటించారు.


”బంగ్లాదేశ్ లో హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు చేయడం తప్పు. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. ఉద్యోగాల కోటా విధానంలో తప్పులవల్ల ఈ హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి,” అని రామస్వామి ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ తరువాత ఆయన 1971 పాకిస్తాన్ నుంచి వేరుపడిన తరువాత ఏర్పడిన బంగ్లాదేశ్ లో ఉద్యోగ కోటా సిస్టమ్ ను వివరించారు.

Also Read: జపాన్ రాజకీయాలు షేక్.. తన పార్టీసభ్యులు అవినీతికి పాల్పడ్డారని అంగీకరించిన ప్రధాని!


”1971లో స్వాతంత్ర్యం సాధించడానికి బంగ్లాదేశ్ లో పెద్ద రక్తపాతమే జరిగింది. వేల సంఖ్యలో బంగ్లాదేశ్ పౌరులను పాకిస్తాన్ సైనికులు హత్య చేశారు. మహిళలపై అత్యాచారం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల్లో కోటా సిస్టమ్ తీసుకువచ్చింది. సివిల్ సర్విస్ ఉద్యోగాల్లో 80 శాతం స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్ ఉద్యమకారులకు వారి కుటుంబాలకు రిజర్వేషన్ కల్పించారు. 20 శాతం మాత్రమే మెరిట్ కోటా ప్రవేశ పెట్టారు.

ఆ కోటా విధానంలోనే తప్పులున్నాయి. ఆ విధానం ఇప్పటి వినాశననానికి కారణం. దాని వల్ల 2018లో నిరసనలు మొదలయ్యాయి. దాంతో ప్రధాని షేక్ హసీనా రిజర్వేషన్ కోటను రద్దు చేసింది. కానీ 2024లో కోర్టు పాత కోటా విధానమే తీసుకురావాలని చెప్పడం మళ్లీ సమస్య మొదలైంది. ఆ తరువాత ఆగస్టు 5న జరిగిన నిరసనల్లో పెద్ద స్థాయిలో హింస జరిగింది. ఈ నిరసనలకు షేక్ హసీనా నియంతృత్వ పాలన కూడా కారణమే. ఆమె పాలనలో మానవ హక్కులకు భంగం కలిగింది. హింసాత్మక నిరసనల్లో ఇప్పటివరకు 450 మంది చనిపోయారు. 1971లో పాకిస్తాన్ సైన్యం చేసిన హత్యలు, అత్యాచారాల కంటే ఇప్పుడు అధికంగా హింస జరుగుతోంది. హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులపై 205 హింసాత్మక దాడులు జరిగాయి. ఈ హింస నుంచి అందరూ పాఠాలు నేర్చుకోవాలి. దేశంలో కొత్త చట్టాలు చేసే సమయంలో దాని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనేది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి.” అని రామస్వామి వివరంగా రాశారు.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన వేలాది మంది హిందువులు భారతదేశంలో శరణార్థులగా ఉన్నారు. ఈ అంశంపై భారత ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది.

Also Read: మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డ్‌ను సమం చేసిన ప్రధాని మోదీ..

 

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×