Kamala harris: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అధికార డెమోక్రటిక్ పార్టీ విజయం సాధిస్తుందా? విపక్ష రిపబ్లికన్ పార్టీ గెలుస్తుందా? కాకపోతే ఇరు పార్టీల హోరాహోరీ పోరు సాగినట్టు సర్వేలు చెబుతున్నాయి. మరి గెలుపు ఎవరిది? ఇదే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
డెమోక్రటిక్ అభ్యర్థిగా ఇండో-అమెరికా సంతతికి చెందిన కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయం సాధించాలని కోరుతూ తెలంగాణలో 11 రోజుల యజ్ఞం జరిగింది. ఆ క్రతువు పూర్తి అయ్యింది.
కమలా హారిస్ తల్లి పేరు శ్యామలా గోపాలన్ పేరుతో ఓ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో మహాయజ్ఞం జరిగింది. దీనికి తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ ప్రాంతం వేదికైంది. 11 రోజుల కిందట మొదలైన ఈ కార్యక్రమం పూర్ణాహుతితో ముగిసింది.
ఇంతకీ ఈ సొసైటీని స్థాపించినదెవరు? అన్నదే అసలు ప్రశ్న. నార్మల్‌గా కమలా హారిస్ పూర్వికులు తమిళనాడుకు చెందినవారు. తెలంగాణలో యజ్ఞం నిర్వహించడమేంటి? అన్నదే అసలు ప్రశ్న.
ALSO READ: మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఎలక్షన్ ప్రక్రియ ఎలా సాగుతుందంటే?
కమలా తల్లి శ్యామలా గోపాలన్ పేరు మీద సొసైటీని స్థాపించాడు నల్లా సురేష్‌రెడ్డి అనే వ్యక్తి. ఆయన కొంతకాలం అమెరికాలో ఉన్నారు. అప్పుడు కమలాహారిస్ ఆ పార్టీ తరపున సెనేటర్‌గా ఉండేవారు. ఆ సమయంలో కమలా తల్లి గురించి తెలుసుకున్న ఆయన, సొసైటీని ఏర్పాటు చేయడం జరిగిపోయింది.
ఈ నేపథ్యంలో శ్రీ రాజా శ్యామలా దేవి సహిత శత చండీ మహా సుదర్శన యజ్ఞం నిర్వహించారు సురేష్‌రెడ్డి. ఈ కార్యక్రమాన్ని దాదాపు 40 మంది వేద పండితులు నిర్వహించారు. 7000 మంది పాల్గొన్నట్లు ఓ అంచనా. కమలాహారిస్ పూర్వీకుల గ్రామం తమిళనాడులోని తిరువారూర్ జిల్లా తులసేంద్రపురంలో ఇలాంటి ప్రత్యేక పూజలు జరిగాయి.