EPAPER

US airstrikes: సిరియాపై బాంబుల వర్షం..ఐసిస్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు!

US airstrikes: సిరియాపై బాంబుల వర్షం..ఐసిస్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు!

US airstrikes target multiple militant camps in Syria: అగ్రరాజ్యం అమెరికా సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఐసిస్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. మొత్తం 37 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో పాటు దాని మిత్రదేశాలపై ఐసిస్ దాడులు చేసేందుకు పన్నాగం పన్నుతోందని అగ్రరాజ్యానికి కచ్చితమైన సమాచారం ఉంది.


ఇప్పటివరకు దశలవారీ దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన చేసింది. అయితే ముందస్తుగా దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో సిరియాలోని సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని సమాచారం.

ఇటీవల సిరియాపై అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి కావడం విశేషం. సెప్టెంబర్ చివరిలో ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా అమెరికా గగనతల దాడులు చేసింది. తాజాగా చేసిన దాడులతో ఐసిస్ శక్తి సామర్థ్యలు దెబ్బతిన్నట్లు అమెరికా ప్రకటించింది.


ఇందులో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్ ఖైదా అనుబంధ సంస్థలకు చెందిన ఉగ్రవాదలు హతమైనట్లు తెలిపింది. ఇందులో మృతిచెందిన వారిలో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు వివరించింది. అలాగే ఈ దాడి చేసిన తర్వాత ఐసిస్ బలం పూర్తిగా దెబ్బతిందని అమెరికా వెల్లడించింది.

Also Read: ‘ఇజ్రాయెల్ కు సాయం చేయొద్దు.. లేకపోతే’.. అరబ్బు దేశాలకు ఇరాన్ గట్టి వార్నింగ్

అయితే, తమపై వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తే సహించే ప్రసక్తే లేదని అమెరికా స్పష్టం చేసింది. ఇందులో ప్రధానంగా ప్రయోజనాలకు విఘాతం, మిత్రదేశాలకు వ్యతిరేకంగా చేయవద్దని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, హమాస్, హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది.

ఇదిలా ఉండగా, ఐసిస్ మళ్లీ దాడి చేయకుండా అడ్డుకునేందుకే అమెరికా బాంబుల వర్షం కురిపించడంతో పాటు సిరియాలో 900 మంది భద్రత సిబ్బంది మొహరించినట్లు తెలుస్తోంది. మరోవైసే ఇరాన్‌పై అమెరికా ఆక్షలు విధించింది. కాగా, అమెరికా మిత్రదేశాలకు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Related News

Cyber Attacks On Iran: ఇరాన్ లో పెద్దఎత్తున సైబర్ దాడులు.. అణుస్థావరాలే లక్ష్యం

Air India Flight Tricky Situation: 2 గంటలకు గాల్లోనే విమానం.. ఎయిర్ ఇండియా తిరుచురాపల్లీ-షార్జా ఫ్లైట్‌లో ఏం జరిగింది?

Iran Warns Gulf Countries: ‘ఇజ్రాయెల్ కు సాయం చేయొద్దు.. లేకపోతే’.. అరబ్బు దేశాలకు ఇరాన్ గట్టి వార్నింగ్

Sahara Desert Floods: ఎడారిలో వరదలు.. ఒక్కరోజులో 100mm భారీ వర్షంతో రికార్డ్!

PM Modi ASEAN SUMMIT: ‘వ్యాపారమే కాదు ఆర్థిక, సామాజిక అవసరాల్లో సహకారం కావాలి’.. ఆసియా దేశాలతో ప్రధాని మోదీ

Trump Biopic: థియేటర్లలోకి ‘ది అప్రెంటీస్’, ట్రంప్ కు ఎదురు దెబ్బ తప్పదా?

Big Stories

×