EPAPER

Pakistan Ahmadi Community: ‘ఆ సామాజిక వర్గంపై దాడులు ఆపండి’.. పాకిస్తాన్ కు ఐరాస మానవ హక్కుల సంఘం హెచ్చరిక

Pakistan Ahmadi Community: ‘ఆ సామాజిక వర్గంపై దాడులు ఆపండి’.. పాకిస్తాన్ కు ఐరాస మానవ హక్కుల సంఘం హెచ్చరిక

Pakistan Ahmadi Community| ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ పాకిస్తాన్ ప్రభుత్వంపై మండిపడింది. పాకిస్తాన్ లోని మైనారిటీలలో అహ్మదీ సామాజికవర్గంపై జరుగుతున్న హింసాత్మక దాడులను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని గురువారం చెప్పింది. పాకిస్తాన్ లో అహ్మదీ ముస్లింలపై జరుగుతున్న మూక దాడుల వల్ల హింస పెరిగిపోతోందని.. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని మానవ హక్కుల కౌన్సిల్ తెలిపింది.


19వ శతాబ్దంలో పాకిస్తాన్ ఏర్పడక ముందు పంజాబ్, బలూచిస్తాన్ ప్రాంతాలలో మిర్జా గులామ్ అహ్మద్ అనే వ్యక్తి తాను ఒక ప్రవక్త అని, దేవుడి తరపున వచ్చిన దూత అని ప్రకటించుకున్నాడు. ఆయన ముస్లింలకు తానే ప్రతినిధి అని ప్రకటన చేయగానే.. మత విద్వేషాలు చెలరేగాయి. ఇస్లాం మతం ప్రకారం.. ప్రవక్త మొహమ్మద్ చివరి ప్రవక్త.. ఆయన తరువాత మరో ప్రవక్త ఉండడు. కానీ పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ లో కొందరు మిర్జా గులామ్ అహ్మద్ కి అనుసరిస్తూ.. అహ్మదియా ముస్లింలుగా మారిపోయారు.

ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న సున్నీ ముస్లింలు ఈ అహ్మదియా ముస్లింలను బహష్కిరించారు. పాకిస్తాన్ ప్రభుత్వమైతే అహ్మదీలు అసలు ముస్లింలే కాదంటూ 1974లో పార్లమెంటులో ప్రకటించింది. అప్పటి నుంచి అహ్మది ముస్లింలపై పాకిస్తాన్ లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. జూలై నెలలోనే ఇద్దరు అహ్మదీలు మూకదాడిలో చనిపోయారు.


గత కొన్ని దశాబ్దాలుగా అహ్మదీ ముస్లింపై బాంబు దాడులు, మూక దాడుల ఘటనలు పెరిపోతున్నాయి. పాకిస్తాన్ లోని హాసిల్ పూర్ జిల్లాలో అహ్మదియా సామాజిక వర్గం అధ్యక్షుడని జూన్ నెలలో కాల్చి చంపారు. జూన్ నెలలోనే పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ రాష్ట్రంలో నిద్రపోతున్న ఏడుగురు అహ్మదీలపై కాల్పులు జరపడంతో అందరూ మరణించారు. చనిపోయిన వారంతా కూలీ పనిచేసుకునే వారని మీడియా తెలిపింది.

ఈ ఘటనలపై స్పందిస్తూ.. ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల సంఘం పాకిస్తాన్ ప్రభుత్వానిక ఓ లేఖ రాసింది. ”పాకిస్తాన్ లో అహ్మదీ ముస్లింలపై జరుగుతున్న దాడులు ఆపేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. అహ్మదీ ముస్లింల ప్రార్థనా స్థలాలకు భద్రత కల్పించాలి”, అని ప్రభుత్వాన్ని మానవ హక్కువ కౌన్సిల్ కోరింది.

 

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×