EPAPER
Kirrak Couples Episode 1

UNSC India: ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’.. యుకె ప్రధాని

UNSC India: ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’.. యుకె ప్రధాని

UNSC India: భారతదేశానికి ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని యునైటెడ్ కింగ్‌డమ్ (బ్రిటన్) ప్రధాన మంత్రి కీర్ స్టార్‌మర్ అన్నారు. ప్రస్తుతం ఐరాస భద్రతా మండలి 79వ అంతర్జాతీయ సమావేశాలు అమెరికాలోని న్యూ యార్క్ లో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో గురువారం సాయంత్రం ప్రధాని స్టార్‌మర్ ప్రసంగించారు.


ఐరాస భద్రతా మండలి సమావేశాల్లో యుకె ప్రధాని ప్రసంగిస్తూ.. ”ఐరాస వ్యవస్థ రూపంలో విజయవంతంగా పనిచేయాలంటే పేదవాళ్లు, అన్యాయానికి గురైన వారి గొంతకులను వినాల్సిందే. అందుకోసం వ్యవస్థలో వారికి ప్రాతినిధ్యం కల్పించాలి. వారి సమస్యలపై స్పందించేందకు ఇది చాలా అవసరం. సరైన ప్రాతినిధ్యం ఉంటేనే సమస్యలు సరిగా పరిష్కారమవుతాయి. దీనికోసం ముందుగా ఐరాస భద్రతా మండలి స్వరూపం మారాలి. రాజకీయాలు చేసి ఐరాస మండలిని కట్టడి చేశారు. ఎటువంటి చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకుండా చేశారు. దీన్ని మార్చాలంటే.. మండలిలో ఎక్కువ దేశాలకు సభ్యత్వం కల్పించాలి. ఆఫ్రికా దేశాలు, బ్రెజిల్, ఇండియా, జపాన్, జర్మనీ లాంటి దేశాలకు శాశ్వతంగా ఐరాస భద్రతా మండలిలో సభ్యత్వం ఇవ్వాలి.” అని చెప్పారు.

ఐరాస భద్రతా మండలిలో ప్రస్తుతం అయిదు శాశ్వత సభ్య దేశాలు (అమెరికా, చైనా, రష్యా, యుకె, ఫ్రాన్స్), 10 తాత్కాలిక దేశాలున్నాయి. ఈ తాత్కాలిక దేశాల సభ్యత్వం కోసం రెండు సంవత్సరాల కోసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే వీరికి వీటో అధికారం ఉండదు. శాశ్వత సభ్య దేశాలకు మాత్రమే వీటో అధికారం ఉంటుంది. ఏదైనా బిల్లు ప్రతిపాదించిన సమయంలో ఒక శాశ్వత సభ్యదేశం దానికి వ్యతిరేకంగా వీటో చేస్తే.. ఆ బిల్లు అప్పుడే వీగిపోతుంది.


Also Read: ఇక యుద్ధంలో రష్యా అణు ఆయుధాలు ఉపయోగిస్తుంది’.. పాశ్చాత్య దేశాలకు పుతిన్ వార్నింగ్!

ఐరాస భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం కోసం చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఆ ప్రతిపాదన వచ్చిన ప్రతీసారి చైనా వీటో చేస్తుంది. దీంతో ఇండియాకు శాశ్వత సభ్యత్వం లభించడం లేదు. అయితే ఈ సంవత్సరం శాశ్వత సభ్యులుగా ఉన్న 5 దేశాలలో మూడు దేశాలు.. అమెరికా, ఫ్రాన్స్, యుకె ఇండియాకు శాశ్వత సభ్యత్వం కోసం మద్దుతు తెలిపాయి.

యుకె ప్రధాని కంటే ముందు అమెరికా, ఫ్రాన్స్ దేశాల ప్రెసిడెంట్లు జో బైడెన్, ఎమానుయెల్ మాక్రాన్ కూడా ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని అన్నారు. యుకె ప్రధాని కంటే ఒక్కరోజు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమానెయెల్ మాక్రాన్ ఐరాస భద్రతా మండలిలో భారత్ కు సభ్యత్వం కల్పించాలని గట్టిగా వాదించారు. ఆయన బుధవారం సమావేశాల్లో మాట్లాడుతూ.. ”భద్రతా మండలిలో అడ్డంకులు ఉన్నంత కాలం మనం ముందుకు సాగలేం. ఐకరాజ్య సమితిని సమర్థవంతంగా చేయాలంటే ముందు భద్రతా మండలి మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఫ్రాన్స్ ఇదే చెబుతోంది. జర్మనీ, జపాన్, ఇండియా, బ్రెజిల్ దేశాలు, ఆఫ్రికా ఖండం నుంచి రెండు దేశాలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలి.” అని మాక్రాన్ అన్నారు.

అంతకుముందు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో క్వాడ్ దేశాల సమావేశాలకు వెళ్లినప్పుడు ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా ఇదే మాట అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సమస్యలు వస్తే.. వాటిని పరిష్కరించేందుకు ఇండియా ఎప్పుడూ ముందు ఉంటుంది. కరోనా సమయంలో ఇతర దేశాలకు భారత్ అందించిన సాయాన్ని ఆయన గుర్తుచేస్తూ.. భారతదేశానికి ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించే అవసరం ఉందన్నారు. భారత్‌కు ఎల్లప్పుడూ అమెరికా అండగా ఉంటుందని తెలిపారు.

Related News

Pakistan: సౌదీలో బిచ్చగాళ్ల మాఫియా.. పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!

Bangladesh: బంగ్లాదేశ్‌లో అరాచకం.. దుర్గాపూజపై ఆంక్షలు.. నిర్వహించవద్దని హెచ్చరికలు!

Russia nuclear Weapons: ‘ఇక యుద్ధంలో రష్యా అణు ఆయుధాలు ఉపయోగిస్తుంది’.. పాశ్చాత్య దేశాలకు పుతిన్ వార్నింగ్!

Harini Amarasuriya: యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు శ్రీలంక ప్రధాని పదవి.. ఎందుకో తెలుసా?

PM Narendra Modi: శాంతికి టెర్రరిజం పెనుముప్పు.. గ్లోబల్ యాక్షన్ అవసరమని మోదీ పిలుపు

Earthquake Japan: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత.. సునామీ హెచ్చరికలు!

Big Stories

×