EPAPER

Family Visa: మరింత కఠినంగా యూకే ఫ్యామిలీ వీసా.. వేతన పరిమితి 55% పెంపు

Family Visa: మరింత కఠినంగా యూకే ఫ్యామిలీ వీసా.. వేతన పరిమితి 55% పెంపు

Family Visa: యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి వలస వచ్చే వారి సంఖ్యను తగ్గించేందుకు యూకే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు కుటుంబ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారీ స్థాయిలో స్పాన్సర్ వీసా ఆదాయ పరిమితిని పెంచింది.


బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అక్కడికి వలస వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వలసలను అడ్డుకట్ట వేసేందుకు.. బ్రిటిష్ పౌరులు, శాశ్వత నివాసితులు తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకారావాలంటే అందుకు కనీస వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55 శాతానికి పెంచింది.

ప్రస్తుతం స్పాన్సర్ కుటుంబ ఆదాయ పరిమితి 18,000 పౌండ్లు ఉండగా.. దాన్ని 29,000 పౌండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాము తీసుకున్న ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. దీంతో పాటుగా వృత్తి నిపుణుల వీసా నిబంధనలతో సమానంగా కుటుంబ వీసాల కోసం వేతన పరిమితిని 38,700 పౌండ్లకు పెంచుతున్నట్లు రిషి సునాక్ ప్రభుత్వం వెల్లడించింది.


కాగా, గత రెండు మూడు సంవత్సరాలుగా యూకే ఆర్థిక అస్థవ్యస్తంగా తయారైంది. దీంతో గతేడాది డిసెంబర్ నెలలో యూకే ప్రభుత్వం హౌస్ ఆఫ్ కామన్స్ లో ఉపాధి వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ఓ బిల్లును ప్రవేశపెట్టింది.

Also Read: ఛీ.. ఛీ.. మరీ ఇంతలా.. నాలుగు గంటల రొమాన్స్, కలా.. నిజమా?

గతంలో వీసా కోసం వేతన పరిమితి 38,700 పౌండ్లకు పెంచాలని నిర్ణయం తీసుకోగా.. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున వెనక్కి తగ్గింది. దీంతో రెండు దశల్లో ఈ పెంపును అమలు చేస్తామని సునాక్ ప్రభుత్వం ప్రకటించింది.

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×