EPAPER

UAE Blue Residency Visa: బంపరాఫర్.. ఇలా చేసినవారికి.. దుబాయ్‌లో 10 ఏళ్లు ఉండే ఛాన్స్..!

UAE Blue Residency Visa: బంపరాఫర్.. ఇలా చేసినవారికి.. దుబాయ్‌లో 10 ఏళ్లు ఉండే ఛాన్స్..!

UAE Announces 10 year Blue Residency Visa: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణాన్ని రక్షించేందుకు, సుస్థిరతకు ముందడుగు వేసింది. ఆ దిశగా ముందడుగులు వేస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తారో అలాంటి వ్యక్తులకు సుదీర్ఘకాలం పాటు రెసిడెన్సీ వీసాను ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.


ఇందుకు సంబంధించి ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుందని, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేవారికి బ్లూ రెసిడెన్సీ వీసాను జారీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని యూఏఈ పీఎం షేక్ మహమ్మద్ బిన్ రషీద్ తెలిపారు. తమ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం అనే విషయం పర్యావరణ సమతుల్యతతో ముడిపడి ఉందని, ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిరతను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ ప్రభుత్వం పేర్కొన్నది.

అయితే, ఈ బ్లూ రెసిడెన్సీ విసా విషయానికి వస్తే.. ఎవరైతే పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారో అలాంటివారికి పదేళ్లపాటు యూఏఈలో నివాసం ఉండేందుకు ఈ వీసాను జారీ చేస్తారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే విధంగా పలు రంగాల్లో అనగా.. మెరైన్ లైఫ్, భూ ఉపరితలంపై పర్యావరణ వ్యవస్థ, గాలి నాణ్యత, సాంకేతిక వంటి తదితర రంగాల్లో పనిచేస్తున్నవారు ఈ వీసాలకు అర్హులు కానున్నారు. ఈ వీసాలు పొందిన వ్యక్తులకు యూఏఈలో దీర్ఘకాలిక నివాసం లభిస్తుంది. దీనితోపాటు పర్యావరణ ప్రాజెక్టుల్లో కూడా సహకారం అందించే అవకాశాలు కూడా లభించనున్నాయి. అంతేకాదు పర్యావరణ పరిరక్షణ కోసం వారు చేసేటువంటి పనుల కోసం నిధులు, వనరులను కూడా ప్రభుత్వం నుంచి తీసుకునేందుకు వెసులుబాటును కల్పించారు.


Also Read: భారత్ చంద్రుడిపైకి వెళ్లి చరిత్ర సృష్టిస్తే.. మనం మాత్రం.. పాక్ నేత స్పీచ్ వైరల్!

అయితే, ఇది ఇలా ఉంటే.. యూఏఈ ప్రభుత్వం ఇప్పటికే గోల్డెన్ వీసాలను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలకు, వ్యవస్థాపకులకు, అసాధారణ టాలెంట్ కలిగిన గ్రాడ్యుయేట్స్ కు 10 ఏళ్ల కాలపరిమితితో ఈ ప్రత్యేక విసాలను అందిస్తున్న విషయం తెలిసిందే. మన దేశానికి చెందిన పలువురు ప్రముఖులకు ఈ వీసాలను లభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యూఏఈ ఈ కొత్త వీసాను ప్రకటించింది. 10 ఏళ్ల కాలానికి బ్లూ రెసిడెన్సీ వీసాను ఇవ్వనున్నట్లు యూఏఈ ప్రధానమంత్రి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సహించేందుకు ఈ విధంగా వీసాలను జారీ చేస్తున్నట్లు తెలిపారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో దుబాయ్ ఒక నగరం. దుబాయ్ ని యూఏఈలో మెరిసే ఆభరణంగా పిలుస్తుంటారు. ఎత్తయిన స్కైవేలు, అద్భుతమైన ఆర్కిటెక్చర్ తోపాటు ఎన్నో వింతైన విశేషాలు కలిగిన నగరం దుబాయ్. దుబాయ్ మాల్ వంటి అనేక షాపింగ్ మాల్స్ ఇక్కడ ఉన్నాయి. దుబాయ్ మాల్ ప్రపంచంలోనే అతిపెద్ద మాల్ గా చెబుతుంటారు. అదేవిధంగా బుర్జ్ ఖలీఫా గురించి దాదాపుగా తెలియనివారుండరు. బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినటువంటి భవనంగా చెప్పబడుతుంది. దీనిని 828 మీటర్ల ఎత్తులో 163 అంతస్తులతో నిర్మించారని చెబుతారు. అందుకే దుబాయ్ కి పర్యాటకుల సంఖ్య ఎక్కువ అని చెబుతుంటారు.

Tags

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×