EPAPER
Kirrak Couples Episode 1

Types of Rituals : వీళ్ల దుంప తెగ.. ఇవేం ఆచారాలో..!

Types of Rituals : వీళ్ల దుంప తెగ.. ఇవేం ఆచారాలో..!

Types of Rituals : మానవుడి సామాజిక జీవితంలో ఆచారాలు, కట్టుబాట్లు భాగంగా ఉన్నాయి. అయితే.. ఆధునిక కాలంలోనూ తమ పూర్వీకులు నిర్దేశించిన వేలాది ఏళ్ల నాటి కట్టుబాట్లను, సంప్రదాయాలను తు.చ తప్పకుండా పాటిస్తున్న గిరిజన తెగలు, సమూహాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వీటిలో కొన్ని మనల్ని హాయిగా నవ్వుకునేలా చేస్తే.. మరికొన్ని భయపడేలా చేస్తాయి. అలాంటి కొన్ని వింత ఆచారాలు మీకోసం..


ఫ్రాన్స్‌లో ఫస్ట్‌నైట్‌ జరిగే గది బయట వధూవరుల స్నేహితులు, కుటుంబ సభ్యులంతా పోగై.. పెద్దగా డ్రమ్స్‌ కొడుతూ, బూరలు ఊదుతూ, అక్కడి వస్తువులను నేలకేసి కొట్టి చప్పుళ్లు చేస్తారు. అప్పుడు ఆ దంపతులు బయటికి వచ్చి వారికి మిఠాయిలు పంచుతారు. ఈ కార్యక్రమాన్ని ‘చరివరి’ అంటారు.

కొరియాలో వరుడి కాళ్లని అతని స్నేహితులు తాడుతో కట్టేసి, అతని పాదాల మీద కోర్వీనా జాతి చేపతో, లేదా బెత్తంతో గట్టిగా కొడతారు. అలా చేస్తే ఫస్ట్‌ నైట్‌ సమయానికి వరుడు బాగా రాటుదేలతాడని వారి నమ్మకం!


చైనాలోని ‘యుగర్‌’ తెగలో వరుడు విల్లును ఎక్కుపెట్టి 3 గాయపరచని బాణాలు వధువు మీద వేస్తాడు. అలా వధువుకు తగిలి, కింద పడిన బాణాలను వరుడు ఏరి ఒక్కసారిగా విరిచిపారేయాలి. అలా చేస్తే వివాహబంధం బాగుంటుందని వారి నమ్మకం.

రొమేనియాలో పెళ్లికి ముందు వధువును ఆమె ఫ్రెండ్స్‌ కిడ్నాప్ చేసి.. ఓ చోట దాస్తారు. అప్పుడు వరుడు ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి.. తన ఫ్రెండ్స్‌కు కోరినన్ని మద్యం బాటిల్స్ నజరానా ఇచ్చుకొని, ఓ పాట పాడాలి. అప్పుడే వారు వధువును విడుదల చేస్తారు.

రష్యాలో పెళ్లికి ముందే పెళ్లికూతుర్ని చూడాలని వరుడు అనుకుంటే.. డబ్బు చెల్లించాల్సిందే. పెళ్లి కూతురు ఇంటి ముందుకు వెళ్లి కొంత డబ్బును ఆమెకోసం కవర్‌లో పెట్టి లోనికి విసరాలి. ఆ మొత్తం చాలకపోతే.. అమ్మాయి కుటుంబంలోని ఎవరైనా పురుషుడు పెళ్లి గౌన్ వేసుకుని బయటికి వస్తాడు. అప్పుడు పెళ్లికొడుకు మరికొంత రుసుం చెల్లిస్తేనే నెచ్చెలి దర్శనం దొరకుతుంది.

ఇండోనేషియాలోని డాని అనే తెగ ఉంది. ఏ కుటుంబంలోనైనా ఒక వ్యక్తి చనిపోతే.. ఆ కుటుంబంలోని స్త్రీలంతా తమ చేతి వేళ్లలో ఒకదానిని అంగుళం మేర కత్తెరించుకోవాల్సి ఉంటుంది. కొన్నేళ్ల క్రితం ఇక చాలంటూ యువతరం దీనికి చెక్ పెట్టే ప్రయత్నం చేసినా.. తెగలోని వృద్ధులు మాత్రం దీనిని పాటిస్తూనే ఉన్నారు.

ఉత్తర టాంజానియాలో.. ‘మసాకి’ అనే గిరిజన తెగ వారు తమ కుటుంబ శుభకార్యాల్లో, తమ ఇంట బిడ్డ పుడితే.. ఇంటి ముందు ఆవును కట్టేసి.. దానిని బాణంతో గాయపరచి, దాని రక్తం తాగుతారు. అయితే.. ఆవు చనిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.

కెన్యాలో ‘మాసాయి’ తెగలో పెళ్లి అప్పగింతల వేళ.. వధువు తండ్రి కూతురు ముఖం, ఎద మీద ఉమ్ముతాడు. ఇలా తండ్రి దీవించాక.. ఆమె వెనక్కు తిరిగి చూడకుండా మెట్టినింటికి వెళ్లాలి. ఒకవేళ తల తిప్పి చూస్తే ఆమె శిలగా మారిపోతుందని మాసాయి తెగల ప్రజలు నమ్ముతారు.

మలేషియా, ఇండోనేషియాలోని ‘టిడాంగ్’ తెగలో పెళ్లి కాగానే కొత్త దంపతులను బాత్‌రూమ్ లేని గదిలో పెట్టేస్తారు. 3 రోజుల పాటు మలమూత్ర విసర్జన చేయటం గానీ, స్నానం చేయటం గానీ కుదరదు. ఇలా చేస్తే.. వారి వైవాహిక జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని వారు నమ్ముతారు.

కంబోడియాలో తమ కూతురికి పీరియడ్స్ ప్రారంభం కాగానే (అంటే 13 నుంచి 16 ఏళ్లలోపు) తల్లిదండ్రులు వారికి ప్రత్యేకంగా గుడిసెలు నిర్మిస్తారు. స్థానిక గిరిజన భాషలో ‘లవ్ హట్’‌గా పిలిచే ఈ ఇంటి వద్ద నివాసముంటూ.. మనసుకు నచ్చిన వరుడిని ఎంచుకుని, అతనితో సహజీవనం చేయొచ్చు. ఎవరైనా అమ్మాయికి.. ఇప్పుడున్న అబ్బాయి పూర్తిగా నచ్చితే.. అతనితో పెళ్లిచేస్తారు. లేకుంటే.. మరొక అబ్బాయి కోసం అమ్మాయి అన్వేషిస్తుంది.

చైనాలోని ‘తుజియా’ తెగలో పెళ్లికి నెలరోజుల ముందు నుంచి పెళ్ళికూతురు రోజుకు గంట చొప్పున ఏడవాలి. 10 రోజులు కాగానే.. పెళ్లి కూతురు తల్లి కూడా తోడు కూర్చుని ఏడుస్తుంది. మరో పదిరోజులు కాగానే.. పెళ్లికూతురి అమ్మమ్మ కూడా తోడవుతుంది. నెలాఖరుకి చుట్టాల్లోని మహిళలంతా తోడై ఓ గంటపాటు శోకాలు పెడతారు. ఈ టైంలో బాగా ఏడ్చిన వారిని.. కుటుంబ పెద్దలంతా మెచ్చుకుంటారు.

ఫిజీ దేశంలో పెళ్ళికొడుకు పిల్లనిచ్చే మామను తిమింగలం దంతాన్ని కట్నంగా అడుగుతాడు. చాలా విలువైన ఆ దంతం కొనటం కోసం ఇప్పటికీ అక్కడ చాలామంది తమ ఆస్తులు అమ్ముకోవటమే గాక.. అదీ చాలకపోతే.. దొంగతనాలూ చేస్తుంటారు.

స్వీడన్‌లో వింత ఆచారం ఒకటి ఉంది. దాని ప్రకారం.. పెళ్లి రిసెప్షన్ జరుగుతుండగా.. వరుడు తాను కూర్చున్న కుర్చీలోంచి లేచి.. ఏదైనా పనిమీద బయటికి పోతే (చివరకు వారు బాత్‌రూమ్‌కి వెళ్లినా).. ఆ విందుకు వచ్చిన పురుష అతిథులు ఆ వధువును ముద్దుపెట్టుకోవచ్చు. అదే.. వధువు బయటకి పోతే.. మహిళా అతిథులు ఆ కొత్త పెళ్లికొడుకుకు నచ్చినట్లు ముద్దుపెట్టొచ్చు.

ఆఫ్రికాలోని కొన్ని తెగల్లో ఫస్ట్ నైట్ కోసం పెళ్లికూతురు గదిలోకి వెళ్లేటప్పుడు.. ఆమెతో బాటు ఆమె తల్లికూడా గదిలోకి వస్తుంది. అంతేకాదు.. తెల్లవార్లూ ఆమె ఆ గదిలోనే ఓ మూల పడుకొని ఉంటుంది.

కాంగోలోని కొన్ని తెగల్లో పెళ్లి తంతు పూర్తయ్యే వరకు పీటల మీద కూర్చున్న వధూవరుల్లో ఎవరూ నవ్వకూడదు. అలా నవ్వితే దానిని అరిష్టంగా భావించి.. ఆ పెళ్లిని రద్దుచేస్తారు.

Tags

Related News

Hezbollah Chief Killed: హెజ్బొల్లాకు భారీ షాక్.. చీఫ్ హసన్ నస్రల్లా మృతి

NASA Will Launch Crew-9 Today: ఈ మిషన్ సక్సెస్ అయితే చాలు.. సునీతా విలియమ్స్ భూమి మీదికి వచ్చినట్లే..

Hurricane Helene: అమెరికాలో హరికేన్ బీభత్సం.. 44 మంది మృతి

Trump Campaign Hacked: ట్రంప్ క్యాంపెయిన్‌ హ్యాక్ చేసిన ఇరాన్?.. అమెరికా కోర్టులో కేసు..

India Rebutes Pakistan: ‘కశ్మీర్ టెర్రరిజంపై మాకు నీతులా?’.. ఐరాస సమావేశాల్లో పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్..

Myopia In Kids Globally: లాక్ డౌన్ తరువాత పిల్లల్లో కంటి సమస్యలు.. బిబిసి నివేదికలో వెల్లడి!

Netanyahu At UN: ‘ఇరాన్ లో ఏ మూలలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయగలదు’.. ఐరాసలో నెతన్యాహు వార్నింగ్!

Big Stories

×