EPAPER

Trump Advice To Israel: ‘ఇరాన్ అణు స్థావారాలపై వెంటనే దాడి చేయండి’.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సలహా

Trump Advice To Israel: ‘ఇరాన్ అణు స్థావారాలపై వెంటనే దాడి చేయండి’.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సలహా

Trump Advice To Israel: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధంపై అమెరికా మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ పార్టీ అగ్రనాయకుడు డొనాల్డ్ స్పందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ట్రంప్ శుక్రవారం అక్టోబర్ 4, 2024న నార్త్ కెరోలీనా లోని ఫయటె విల్లే ప్రాంతంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మీడియాతో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు.


అదే సమయంలో.. ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేయాలని మీరు భావిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం చెబుతూ.. వెంటనే దాడి చేయాలి. న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేయడమే ఉత్తమం. అప్పుడే పరిస్థితి అదుపులో ఉంటుంది. మిగతా విషయాలు తరువాత చూసుకోవచ్చు. ఇరాన్ అణు బాంబులు ప్రయోగిస్తుందా? అంటే చేయగలదు అని భావించే యుద్ధం చేయాలి. ఒక వేళ ఇరాన్ అలా చేస్తే మాకు ముందే సమాచారం అందుతుంది” అని అన్నారు.

Also Read: వ్యభిచారానికి మారుపేరుగా టెంపరరీ పెళ్లిళు.. ఇండోనేషియాలో కొత్త బిబినెస్


మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ విషయాన్ని వ్యతిరేకించారు. గత బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని మీరు సమర్థిస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. బైడెన్ ‘నో’ అని సమాధానమిచ్చారు. ”ఇజ్రాయెల్ పై ఇరాన్ 200 క్షిపణలతో దాడి చేసింది. అయితే దీనికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ అణు స్థావారాలన టార్గెట్ చేయడ సరికాదు అని అన్నారు. ఈ విషయంపై ఇజ్రాయెల్ తో మేము చర్చిస్తున్నాము. మాతో పాటు జి7 దేశాలన్నీ ఇజ్రాయెల్ పక్షాన ఉన్నాయి. ఇరాన్ కు సమాధానం చెప్పే హక్కు ఇజ్రాయెల్ కు ఉంది. అయితే అది శృతి మించకూడదు. ఇజ్రాయెల్ దాడి చేసినా.. అది పరిమితిలోనే ఉండాలి.” అని బైడెన్ చెప్పారు.

బైడెన్ అభిప్రాయాలను ట్రంప్ వ్యతిరేకించారు. ”బైడెన్ ఈ విషయంలో తప్పు చేస్తున్నారు. ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండడమే అతిపెద్ద ప్రమాదం కదా?” అని ట్రంప్ చెప్పారు.

నవంబర్ నెలలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ తన ప్రత్యర్థి ప్రస్తుత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి అయిన కమలా హ్యారిస్ ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం విషయంలో ఇంతవరకు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయకపోవడం గమనార్హం. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. మిడిల్ ఈస్ట్ దేశాలతో అమెరికా సంబంధాలు తినడం.. దీనంతంటికీ జోబైడెన్, కమలా హ్యారిస్ కారణమని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు.

Also Read:  ‘మీ కూతురు వ్యభిచారం చేస్తోంది’.. సైబర్ మోసగాళ్లు చెప్పిన అబద్ధం విని చనిపోయిన టీచర్..

మరోవైపు లెబనాన్ భూభాగంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు రెండు వారాలుగా కొనసాగుతున్నాయి. సైనికులతో పాటు వందల సంఖ్యలో లెబనాన్ పౌరులు ఈ యుద్ధం చనిపోయారు. మృతుల సంఖ్య రోజురోజుకీ పెరిపోతోంది. ఇజ్రాయెల్పై ఇరాన్ 200 క్షిపణులు ప్రయోగించడంతో ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశాలున్నాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయబోతోందని ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది.

Related News

Continent Turns Green: అక్కడ మొక్కలు మొలిచాయంటే.. భూమి అంతమైనట్లే, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది ఇదే!

Conflict: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

Dominica Citizenship: ‘ఎవరైనా రావొచ్చు’.. తక్కువ ధరకే పౌరసత్వం విక్రయిస్తున్న దేశం ఇదే..

Elon Musk Brazil: బ్రెజిల్‌లో ట్విట్టర్ ఎక్స్ ఆగని కష్టాలు.. తప్పుడు బ్యాంకులో ఫైన్ చెల్లింపులు!

India’s Iron Dome: ఇండియాపై శత్రువులు మిసైల్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ తరహా యాంటి మిసైల్ టెక్నాలజీ మన దగ్గర ఉందా?

Israel India Iran: ‘దాడి చేయవద్దని ఇండియా ద్వారా ఇరాన్‌కు ముందే హెచ్చరించాం’.. ఇజ్రాయెల్ అంబాసిడర్

×