EPAPER

Floating Restaurants| నీటిపై తేలియాడుతూ ఎప్పుడైనా డిన్నర్ చేశారా?.. ప్రపంచంలో టాప్ టెన్ ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ ఇవే..

Floating Restaurants| నీటిపై తేలియాడుతూ ఎప్పుడైనా డిన్నర్ చేశారా?.. ప్రపంచంలో టాప్ టెన్ ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ ఇవే..

Floating Restaurants| నీటిపై తేలియాడే రెస్టారెంట్లో డిన్నర్ చేయడం అంటే ఆ అనుభూతి వేరే లెవెల్ ఉంటుంది. చాలా కాలం పాటు గుర్తుండిపోయేలా డిన్నర్ ఉంటుంది. ప్రపంచంలో చాలా రెస్టారెంట్స్‌ మంచి రుచికరమైన వంటలు, వెరైటీ ఐటెమ్స్ అందిస్తున్నాయి.


అయితే మామూలు రెస్టారెంట్స్ కంటే ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ లో డిన్నర్ చేయడం ఇప్పుడు ట్రెండ్ గా మారుతోంది. ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ కు రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోంది.

ప్రకృతి అందాలు, నీటిపై చల్లని గాలి.. మంచి రాక్ మెలోడీ మ్యూజిక్.. వీటన్నింటితో పాటు నోరూరించే భోజనం.. ఇవన్నీ ఒకేసారి అందించే ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ పట్ల స్థానికులతో పాటు టూరిస్టులు కూడా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల్లో ఇలాంటి రెస్టారెంట్స్ కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది.


ప్రపంచలోని టాప్ టెన్ ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ ఇవే:

1.దుబాయ్ – రుస్తార్ ధౌ ఫ్లోటింగ్ రెస్టారెంట్-

Image Source: Pinterest

దుబాయ్ పోర్టు లో ఉన్న రుస్తార్ ధౌ ఫ్లోటింగ్ రెస్టారెంట్.. ప్రపంచంలోనే నీటిపై తేలాడే రెస్టారెంట్లలో అతిపెద్దది. ఈ రెస్టారెంట్ లో మూడు ఫ్లోర్ లున్నాయి. ఒక ఓపెన్ ఎయిర్ లెవెల్, ఒక పెద్ద హాలు, ఒక డాన్స్ బార్. ఈ రెస్టరెంట్ కు వచ్చిన గెస్ట్ లందరూ దుబాయ్ స్కైలైన్ అద్భుత దృశ్యాలను చూస్తూ.. ఒక లగ్జరీ బఫేని ఎంజాయ్ చేస్తారు.

 

2. సీ ప్యాలెస్, ఆమ్ స్టర్ డ్యామ్

Image Source: Pinterest
యూరోపియన్ దేశమైన నెదర్ ల్యాండ్స్ రాజధాని ఆమ్ స్టర్ డ్యామ్ లో ఈ సీప్యాలెస్ రెస్టారెంట్ ఉంది. అయితే ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో అన్నీ చైనీస్ ఐటెమ్స్ మాత్రమే లభిస్తాయి. ఈ రెస్టారెంట్ పగోడా స్టైల్ లో నిర్మించారు. 1984 లో ప్రారంభమైన ఈ రెస్టారెంట్లో దొరికే రుచికర వంటలు తింటూ.. నదీ జలాల చుట్టూ అందాలను తిలకించడానికి జనాలు భారీ సంఖ్యలో వస్తుంటారు.

3. సైగాన్ రెస్టారెంట్ క్రూయిజ్ షిప్, వియత్నాం

Image Source: Pinterest
వియత్నామ్ లోని హో చి మిన్ నగరంలో ఉన్న ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో ఒకేసారి 600 మంది గెస్ట్ లకు సర్వీస్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉంది. ఈ రెస్టారెంట్ లో రుచికరమైన వియత్నాం వంటలతో పాటు ప్రకృతి అందాలు కనువిందు చేస్తుండడంతో తరుచూ ఈ రెస్టారెంట్ బుకింగ్ ఫుల్ ఉంటుంది. చాలామంది సెలెబ్రిటీలు ఈ రెస్టారెంట్లో ప్రైవేట్ ఫంక్షన్స్ చేస్తుంటారు.

4. జంబో ఫ్లోటింగ్ రెస్టారెంట్, హాంగ్ కాంగ్

Image Source: Pinterest
హాంగ్ కాంగ్ లోని అబర్ డీన్ పోర్టులో ఉన్న జంబో ఫ్లోటింగ్ రెస్టారెంట్ చాలా ప్రసిద్ధిగాంచింది. చైనీస్, కాంటోనీస్ విందులు లభించే ఈ రెస్టారెంట్ లో మూడు ఫ్లోర్లున్నాయి. 2003లో ఈ రెస్టారెంట్ ని రినోవేట్ చేశారు. లండన్ మహారాణి ఎలిజబెత్ 2, హాలివుడ్ నటుడు జాన్ వేన్ లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ రెస్టారెంట్ లో భోజనం చేసేందుకు వస్తుంటారు. భారీ వర్షాలు, వరదలొచ్చినా తట్టుకొని నిలబడే విధంగా ఈ రెస్టారెంట్ ను నిర్మించారు.

5. క్లౌడ్ 9, ఫిజి

Image Source: Pinterest
సముద్రంలో ద్వీపాల సమూహ దేశమైన ఫిజిలో క్లౌడ్ 9 ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఉంది. ఫిజిలోని మమనుకా దీవికి సమీపంలో దీన్ని నిర్మించారు. ఈ రెస్టారెంట్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒక ఫిక్స్‌డ్ మెనూ ఉండదు. వారంలో ప్రతీరోజు డైలీ స్పెషల్ ఐటెమ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చే గెస్ట్ లు సన్ బాత్, నీళ్లలో డైవింగ్, స్విమ్మింగ్ లాంటివి చేసేందుకు సౌకర్యం ఉంది.

6. వేలి లేక్ ఫ్లోటింగ్ రెస్టారెంట్, కేరళ, ఇండియా

Image Source: Pinterest
భారతదేశంలో ప్రకృతి సంపద పుష్కలంగా ఉన్న రాష్ట్రం కేరళ. కేరళలోని త్రివేండ్రమ్ లో చుట్టూ పచ్చదనం మధ్య ఉన్న వేలి లేక్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో లభించే భారత వంటకాలలో లోకల్ ఫ్లేవర్ కలగలిసి ఉంటుంది. వేలి సరస్సుపై నిర్మించిన ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై ఈ రెస్టారెంట్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ డిన్నర్ చేస్తుంటే మంచి మూడ్ వస్తుంది.

7. సాల్ట్ అండ్ సిల్, స్విడెన్

Image Source: Pinterest
స్విడెన్ దేశంలో ఉన్న సాల్ట్ అండ్ సిల్ రెస్టారెంట్ లో మంచి టేస్టీ సీ ఫుడ్ లోకల్ రెసిపీలలో లభిస్తుంది. స్విడెన్ లో లభించే షెల్ ఫిష్, క్రే ఫిష్ లతో పాటు వెజిటేరియన్ డిష్ లు మాత్రమే సర్వ్ చేస్తారు. భోజనం తయారీలో ఎటువంటి ప్యాకేజ్ ఫుడ్ ఉపయోగించరు. ఈ కారణంగానే ఈ రెస్టారెంటు కు అవార్డులు లభించాయి. ఈ రెస్టారెంట్ లో మొత్తం 23 గదులున్నాయి. ఈ రెస్టారెంట్ లో లాడ్జింగ్ వసతి ఉంది. ప్రైవేట్ హోటల్ సూట్, రూఫ్ టాప్ లున్నాయి. దీంతో ఇదొక టూరిస్ట్ డెస్టెనేషన్ గా మారింది.

8. పిఎస్ టట్టర్ షల్ క్యాసెల్, లండన్

Image Source: Pinterest
లండన్ లోని థేమ్స్ నదిపై ఉన్న టట్టర్ షల్ క్యాసెల్ రెస్టారెంట్ నిజానికి ఒక బ్రిటీష్ యుద్ధ నౌక. ఈ నౌకనే ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా రూపొందిచారు. 1934లో తయారైన ఈ నౌక 40 ఏళ్ల పాటు లండన్ నేవీలో మిలిటరీ సర్వీస్ కోసం ఉపయోగించారు. ఈ రెస్టారెంట్ లో అన్ని రాయల్ డిషెస్ సర్వే చేస్తుండడంతో.. దీనికో ప్రత్యేకత ఏర్పడింది. ఈ రాయల్ డిషెస్ రుచి ఆనందించడానికి ఇక్కడ చాలా ప్రైవేట్ పార్టీలు, పెళ్లిళ్లు జరుగుతున్నాయి.

9. క్యాట్ బా బే, వియత్నాం

Image Source: Pinterest
వియత్నాంలోని పర్ల్ ఐలాండ్ గా పిలవబడే క్యాట్ బా బే రెస్టారెంట్ లో దొరికే సీ ఫుడ్ వెరైటీ డిషెస్ మరెక్కడా లభించవు. దీంతో పాటు ఈ రెస్టరెంట్ లో గెస్ట్ లు డైవింగ్, జెట్ స్కీంగ్ లాంటి విన్యాసాలు చేసే అవకాశం కల్పిస్తోంది.

10. బిబిక్యూ డోనట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ టేబుల్స్, జర్మనీ

Image Source: Pinterest
పిక్నిక్ స్టైల్ డిన్నర్ ఆఫర్ చేసే ఏకైక రెస్టారెంట్ జర్మనీ దేశంలో ఉంది. దీని పేరు బిబిక్యూ డోనట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ టేబుల్స్. పేరుకు తగ్గట్టుగా రెస్టారెంట్ లో అన్ని ఫ్లోటింగ్ టేబుల్స్ ఉన్నాయి. ఈ టేబుల్స్ కు సౌండ్ సిస్టమ్ అమర్చి పెట్టారు. మీరు గ్రూప్ లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవాలను కుంటే ఇక్కడ టెన్ సీటర్ టేబుల్స్ కూడా ఉన్నాయి.

మొత్తంగా చూస్తే.. ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ లోకి వెళ్తే మంచి వెరైటీ విందులు అందించడమే కాకుండా అద్భుత ప్రకృతి అందాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంతో మీ మరిచిపోలేని డిన్నర్ అనుభూతిని కలిగుతుంది. అందుకే మీరు ఒక మంచి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకున్నా.. లేదా మీ కుటుంబంతో టూర్ కు వెళ్లాలనుకున్నా నీటిపై తేలాడే ఈ హోటళ్లు మంచి ఆప్షన్.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×