EPAPER

Ichinono: ఆ జపాన్ విలేజ్‌లో మనుషుల కంటే బొమ్మలే ఎక్కువ.. ఏ వీధిలో చూసినా అవే కనిపిస్తాయ్, ఎందుకంటే?

Ichinono: ఆ జపాన్ విలేజ్‌లో మనుషుల కంటే బొమ్మలే ఎక్కువ.. ఏ వీధిలో చూసినా అవే కనిపిస్తాయ్, ఎందుకంటే?

Japanese Village Ichinono: రియల్ స్టార్ దివంగత శ్రీహరి నటించి ‘కుబుసం’ సినిమాలో ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ అనే ఓ పాట ఉంటుంది. ఉపాధిలేక, పట్టణాలకు వలస వెళ్లిపోతున్న ప్రజలతో పల్లెలన్నీ ఖాళీ అవుతున్నాయనే బాధలో ఆయన పాడిన పాట అందరినీ కంటతడి పెట్టిస్తుంది. చిన్న ఉద్యోగం అయిన ఫర్వాలేదు తమ పిల్లలు పట్టణాల్లో ఉండాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. తాము గొడ్డు చాకిరీ చేస్తున్నాం, తమ పిల్లలు అలాగే బాధ పడకూడదని ఆలోచిస్తున్నారు. ఫలితంగా యువకులంతా పట్టణాలకు చేరడంతో పల్లెలన్నీ కళతప్పి వెలవెలబోతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే జపాన్ లోని ఇచినోనో కథ కూడా ఇలాంటిదే. ఈ ఊరు ముసలిది అయిపోయింది. ఇక్కడ సుమారు 60 మంది జీవిస్తున్నారు. అందరూ 65 ఏండ్లు పైబడినవాళ్లే. పట్టణాల్లో ఉన్న తమ పిల్లలు పంపించిన డబ్బులతో బతుకును వెల్లదీస్తున్నారు. తమ వ్యవసాయ భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్నారు. తమ తిండికోసం ఉపయోగించుకుంటున్నారు.


రెండేళ్ల బాలుడే ఈ ఊరి ఆశాదీపం

వృద్ధాప్యంతో ఎండిపోతున్న ఈ గ్రామానికి చిరుగుటాకులా మారాడు కురానోసుకే కటో అనే రెండేళ్ల బాలుడు. 20 ఏండ్ల తర్వాత కురానోసుకే ఈ ఊరిలోకి అడుగు పెట్టారు. కరోనా మహమ్మారి తర్వాత కురానోసుకే తల్లిదండ్రులు రీ, తోషికి కటో పట్టణం నుంచి ఈ ఊరికి వచ్చారు. ప్రస్తుతం ఈ ఊళ్లో ఉన్న యువజంట వీళ్లే. ఈ ఊరిలోని వృద్ధులకు సాయంగా నిలుస్తున్నారు. పాత ఇళ్లను పునరుద్దరిస్తున్నారు.  బాలుడు కురానోసుకే అంటే ఈ గ్రామంలోని వాళ్లందరికీ ప్రత్యేకమైన ప్రేమ. ఊరి వాళ్లంతా ప్రత్యేకమైన వంటకాలు చేసి అతడికి తినిపిస్తారు. తమ గ్రామానికి ఆశాభావం అయిన చిన్నారిపై ఎనలేని ప్రేమను కనబరుస్తున్నారు. కురానోసుకే తల్లిదండ్రులు కూడా గ్రామంలోని పెద్దలు తమ మీద చూపించే ప్రేమ పట్ల పులకించిపోతున్నారు. వారికి అండదంగా నిలుస్తామని చెప్తున్నారు.


ఉపాధిలేక పట్టణాలకు వలస

ఒకప్పుడు అన్ని గ్రామాల మాదిరిగానే ఈ ఊరు కళకళలాడేది. ఊరి వాళ్లంతా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించారు. అయితే, ఇక్కడి వాళ్లకు ఉద్యోగాలు లేవనే కారణంగా యుకులకు తమ అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. తల్లిందడ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లు కావేమో అనే ఉద్దేశంతో వారిని పట్టణాలకు పంపించడం మొదలు పెట్టారు. నెమ్మదిగా పేరెంట్స్ కూడా వారితో వెళ్లిపోయి పట్టణాల్లోనే ఉపాధి చూసుకున్నారు. ఇప్పుడు ఈ గ్రామం మోడువారిపోయింది.

ఊరిలో ఎటు చూసినా బొమ్మలే..

తమ ఊరిలో యువతీ యువకులు లేరు అనే బాధ నుంచి బయటపడేందుకు ఈ గ్రామస్తులు కొత్త పద్దతిని కనిపెట్టారు. మనుషులు బొమ్మలను తయారు చేసి ఊళ్లో ఏర్పాటు చేస్తున్నారు. ఏ వీధిలో చూసి చిన్నారులు, యువతీయువకుల బొమ్మలను పెట్టారు. ఆ బొమ్మలను చూసి తమ ఊళ్లో అన్ని యవసుల ప్రజలు ఉన్నారని ఇక్కడ వృద్ధులు సంతోషపడుతున్నారు. జపాన్ లోని చాలా పల్లెల్లో ఇదే పరిస్థితి ఉండటంతో అక్కడి ప్రధాని షిగెరు ఇషిబా కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తే.. అక్కడి ప్రజలకు పట్టణాలకు వెళ్లే అవసరం ఉండదన్నారు.

Read Also: పో*ర్న్ మూవీలో ఆఫర్.. సంతోషం తట్టుకోలేక తల్లికి చెప్పేసిన కొడుకు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Related News

Chinese Govt : ఆ టైమ్‌కి ‘కలిస్తే’ పిల్లలు పుడతారు.. దంపతులకు చైనా సూచనలు, డ్రాగన్ కంట్రీకి ఎంత కష్టమొచ్చిందో!

Naim Qassem Israel: ‘ఎక్కువ కాలం బతకడు.. త్వరలోనే లేపేస్తాం’.. హిజ్బుల్లా కొత్త నాయకుడిపై ఇజ్రాయెల్ వ్యాఖ్యలు

Russia Nuclear Drill: అణు ఆయుధాల డ్రిల్ ప్రారంభించిన రష్యా.. అయోమయంలో అమెరికా?..

Biden Diwali Celebrations: అమెరికా వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు.. ఇండియన్స్‌కు బైడెన్ దావత్

Israel Truck attack: ఇజ్రాయెల్‌ రాజధానిలో ట్రక్కు దాడి.. 35 మందికి తీవ్ర గాయాలు!

Trump Melania Dance: న్యూయార్క్‌లో అట్టహాసంగా ట్రంప్ ఎన్నికల ప్రచారం.. వేలమంది జనం, సెలబ్రిటీలు, భార్యతో డాన్స్..

×