EPAPER

Elon Musk : న్యూరాలింక్‌‌తో ఆశావహ ఫలితాలు..!

Elon Musk : న్యూరాలింక్‌‌తో ఆశావహ ఫలితాలు..!
Elon Musk

The first Neuralink chip in human brain : ఎలన్ మస్క్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టు న్యూరాలింక్. మూడు వారాల క్రితం ఆ కంపెనీ తొలిసారిగా మానవుడికి వైర్‌లెస్ బ్రెయిన్ చిప్‌ను అమర్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ప్రాజెక్టు ఆశావహ ఫలితాలనే ఇస్తోందని మస్క్ తాజాగా ప్రకటించారు. మెదడు-కంప్యూటర్ ఇంటర్ ఫేస్(BCI)గా వ్యవహరించే ఈ సాంకేతికతలో నాణెం పరిమాణంలో ఉన్న న్యూరాలింక్ పరికరాన్ని మనిషి పుర్రెలోకి చొప్పించారు. మానవ మెదడు 8,600 కోట్ల న్యూరాన్లకు నిలయం.


మెదడులోని ఈ నరాల కణాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. మనం కదలాలని అనుకున్నా, అనుభూతి చెందాలని భావించినా, ఆలోచించాలని అనుకున్నా ఒక చిన్న విద్యుత్ ప్రేరణ పుడుతుంది. ఇది ఒక న్యూరాన్ నుంచి మరో న్యూరాన్‌కు వేగంగా కదులుతుంది. ఆ సంకేతాలను గ్రహించే పరికరమే న్యూరాలింక్ బీసీఐ. పక్షవాతం, సంక్లిష్ట నాడీ సంబంధిత చికిత్సల్లో బీసీఐ ఉపయుక్తంగా ఉండగలదు. న్యూరాలింక్‌ను తొలుత పందులపై పరీక్షించగా .. ఆ ట్రయల్స్ విజయవంతమయ్యాయి.

Read more: మూతపడిన ఈఫిల్ టవర్..!


కోతులపైనా పరీక్షించినప్పుడు అవి.. పాంగ్ వీడియో గేమ్‌ను ఆడగలిగాయి. మానవ పరీక్షలకు నిరుడు మేలో న్యూరాలింక్‌కు అమెరికా ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం ఇచ్చింది. గత నెలలో విజయవంతంగా న్యూరాలింక్‌ను మానవపుర్రెలోకి చొప్పించగలిగారు. బ్రెయిన్ చిప్ ఇంప్లాంట్ జరిగిన ఆ వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడని మస్క్ వెల్లడించారు. తన ఆలోచనల ద్వారా కంప్యూటర్ మౌస్‌ని కదల్చగలుగుతున్నాడని వివరించారు. న్యూరాలింక్ ముందు భారీ లక్ష్యాలే ఉన్నాయి. తదుపరి దశలో రోగి ఆలోచనలతో మౌస్ బటన్లను నియంత్రించడం వంటి సంక్లిష్టమైన పరస్పర చర్యల ప్రయోగాలు చేపట్టనున్నారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×