EPAPER

Strongest Earthquake in Taiwan: తైవాన్‌‌ని షేక్ చేసిన భూకంపం.. భారీగా నష్టం!

Strongest Earthquake in Taiwan: తైవాన్‌‌ని షేక్ చేసిన భూకంపం.. భారీగా నష్టం!

Taiwan Strongest earthquake in 25 years hits


Taiwan Strongest Earthquake: తైవాన్‌ని భారీ భూకంపం వణికించింది. ఎత్తైన భవనాలు ధ్వంసమయ్యాయి. ఐదంతస్తుల భవనం 45 డిగ్రీల యాంగిల్ లో ఒరిగిపోయింది. ముఖ్యంగా రాజధాని తైపీలో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. చాలావరకు భవనాల్లో పగుళ్లు వచ్చాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది.

తైవాన్‌‌లోని హువాలియన్ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రస్తుతం ప్రాణ నష్టానికి సంబంధించి అధికారులు వివరాలు వెల్లడించలేదు. విద్యుత్ ప్లాంట్లు దెబ్బతినడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఆదేశ వ్యాప్తంగా రైలు సర్వీసులను రద్దు చేసింది. అనేక పాఠశాలల సెలవులు ప్రకటించారు. భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.


పరిస్థితి గమనించిన తైవాన్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇళ్లలో గ్యాస్ లీకేజ్‌లను తనిఖీ చేసుకోవాలని ప్రజలకు అధికారులు వార్నింగ్ మెసేజ్‌లు పంపించారు. విద్యుత్ ప్లాంట్లు దెబ్బతినడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సునామీ హెచ్చరికలు జారీ చేసి తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. దక్షిణ పింగ్ టుంగ్ నుంచి రాజధాని తైపీ వరకు భూప్రకంపనలు నమోదయ్యాయి.

దశాబ్దకాలంలో బలమైన భూకంపమని అధికారులు చెబుతున్నమాట. ముఖ్యంగా 1999 తర్వాత 25 ఏళ్లలో ఇదే అత్యంత శక్తివంతమైనది అంటున్నారు. ఆ ద్వీప చరిత్రలోకి ఒక్కసారి వెళ్తే..  అప్పట్లో వచ్చిన భూకంపం దాదాపు 2500 మందిని బలి తీసుకుంది. మరోవైపు తూర్పు తైవాన్‌తోపాటు దక్షిణ జపాన్, ఫిలిప్పీన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు సూచన చేశారు. ముఖ్యంగా తైవాన్ భూకంపాల జోన్‌‌లో ఉండడంతో తరుచూ ఇక్కడ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి.

జపాన్‌‌లో కొన్ని దీవుల్లో భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం. ఒకినావా ద్వీప సమూహంలో మూడు మీటర్ల వరకు సునామీ అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. భూకంపం సంభవించిన నిమిషాల వ్యవధిలోనే భారీ అలలు అలయొనగు ద్వీపాన్ని తాకినట్టు జపాన్ సునామీ సంస్థ తెలిపింది. అయితే తైవాన్‌లో సంభవించిన భారీ భూకంపం వల్ల సునామీ ముప్పు పోయిందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది.

https://twitter.com/qatarishehzada/status/1775374884689846781

Tags

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×