EPAPER

Bangladesh Political Crisis: హసీనా ప్రధాని పదవికి ఎసరు తెచ్చిన ద్వీపం.. బంగ్లాపై అమెరికా కుట్ర నిజమేనా?

Bangladesh Political Crisis: హసీనా ప్రధాని పదవికి ఎసరు తెచ్చిన ద్వీపం.. బంగ్లాపై అమెరికా కుట్ర నిజమేనా?

బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల నిరసనలతో మొదలై అది ప్రజా ఉద్యమంగా మారింది. చివరికి, ప్రత్యర్థి లేకుండా 15 ఏళ్లు పరిపాలించిన షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఆగస్టు 5న హసీనా రాజీనామా చేసిన తర్వాత అంతర్జాతీయంగా బంగ్లా రాజకీయ ప్రకంపనలపై ఆందోళన పెరిగింది. ఈ ఘోరమైన హింసాకాండ నేపథ్యంలో బంగ్లా ఆర్మీ దేశాన్ని చేతిలోకి తీసుకుంది. ముందస్తు ఎన్నికలకు సిద్ధం చేయడానికి నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం స్థాపించబడింది. హసీనా రాజీనామా తర్వాత జరిగిన హింసాకాండ ఫలితంగా 230 మందికి పైగా మరణించారు. ఇక, జూలై మధ్యలో నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి మొత్తం మృతుల సంఖ్య 560కి చేరుకుంది. అయితే, ఇంత వినాశనానికి కారణం వెనుక విదేశీ కుట్ర దాగుందనే సందేహాలకు ఇప్పుడు మరింత బలం చేకూరుతుంది.

జులైలో మొదలైన విద్యార్థి నిరసనలు తీవ్రరూపం దాల్చడానికి హసీనా వివాదస్పద వ్యాఖ్యలే కారణమని అప్పట్లో అనుకున్నారు. నిరసనకారులను “రజాకార్లు”గా హసీనా అభివర్ణించడమే నిరసనలను ఉద్యమంగా మార్చయానే అభిప్రాయలు వచ్చాయి. అయితే, తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని హసీనా వివరణ ఇచ్చారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రదారులు ప్రజల అమాయకత్వాన్ని ఉపయోగించుకున్నారనీ దాన్ని అర్థం చేసుకోవడానికి ఆమె ప్రసంగానికి సంబంధించిన పూర్తి వీడియోను చూడాలని కోరారు. ఈ సందర్భంగా.. హసీనా తన బహిష్కరణలో విదేశీ జోక్యం ఉందని చెప్పారు. ఇందులో యునైటెడ్ స్టేట్స్‌ ప్రమేయాన్ని నర్మగర్భంగా వెల్లడించారు.


Also  Read: మస్క్‌తో ఇంటర్వ్యూ.. జో బైడెన్‌పై మరోసారి విరుచుకుపడిన ట్రంప్

అయితే, ఆమె అమెరికా పేరును ప్రస్తావించకుండా.. వైట్ పీపుల్ అనే మాటను వాడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది మొదట్లో బంగ్లాదేశ్ ఎన్నికల్లో ప్రధానిగా మరోమారు గద్దెనెక్కారు. జనవరిలో వరుసగా నాలుగోసారి గెలిచిన హసీనాను బహిష్కరించాలని ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. తర్వాత, ఈ ఎన్నికలు బూటకమని బంగ్లా ప్రతిపక్షంతో పాటు… కొన్ని దేశాలు కూడా వెల్లడించాయి. అయితే, ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగలేదని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి గతంలో వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా హసీనాకు యుఎస్‌తో సమస్యాత్మక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో… తాను అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత, హసీనా తనపై తెల్లజాతి దేశం కుట్ర పన్నుతుందని షాకింగ్ కామెంట్లు చేశారు.

బంగ్లాదేశ్‌లో ఒక తెల్లజాతి దేశం ఎయిర్ బేస్ నిర్మించుకోవడానికి అనుమతిస్తే, జనవరి 7న జరిగే ఎన్నికల్లో తనకు అవాంతరాలు లేకుండా తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరాన్ని నిర్మించుకోవడానికి నేను అనుమతించలేదు కాబట్టి, ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురైనట్లు వెల్లడించారు. అయితే, ఆమె అప్పుడు ఆ దేశం పేరు చెప్పలేదు. “ఈ ఆఫర్ వైట్ మ్యాన్ నుండి వచ్చింది” అని నొక్కి చెప్పినట్లు ది డైలీ వెల్లడించింది. అయితే, ఆ దేశం ఒక్క బంగ్లాదేశ్‌ని మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదనీ… వారు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో నాకు తెలుసు” అని ఆమె అన్నారు. ఇకపై అవామీ లీగ్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉంటుందనీ.. భవిష్యత్తులో ఇంకా ఇబ్బంది ఉంటుందని కూడా ఆమె అప్పట్లో పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌కు చెందిన సెయింట్ మార్టిన్ ద్వీపంపై అమెరికా సార్వభౌమత్వానికి లొంగకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందనీ.. బంగాళాఖాతంపై పట్టు సాధించడానికి అమెరికాను అనుమతించి ఉంటే… తాను అధికారంలో కొనసాగి ఉండేవారని ఇప్పుడు హసీనా చెబుతున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ప్రజలను రాడికల్స్ ద్వారా తారుమారు చేయవద్దని ఈ సందర్భంగా ఆమె కోరినట్లు ప్రచారం జరుగుతోంది. బంగ్లాదేశ్, మయన్మార్‌లోని కొన్ని భాగాలను విభజించడం ద్వారా తూర్పు తైమూర్‌కు సమానమైన క్రైస్తవ రాజ్యాన్ని సృష్టించే లక్ష్యంతో కుట్ర జరుగుతోందని ఆమె ఈ ఏడాది మే నెలలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలు చేశారు. సెయింట్ మార్టిన్ ద్వీపమే ఆమె రాజీనామాకు కారణం అయ్యిందనే తీరులో హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు, భారత్‌లో ఆశ్రయం పొందిన తర్వాత ఆమె ఓ లేఖను కూడా విడుదల చేసినట్లు ప్రస్తుతం ఆమె పార్టీ అవామీ లిగ్ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మాజీ ప్రధాని షేక్ హసీనా భారతదేశానికి బయలుదేరిన తర్వాత మొదటిసారి తన స్పందన ఈ లేఖ ద్వారా విడుదల చేసినట్లు అంతర్జాతీయంగా చర్చ నడుస్తోంది. బంగ్లా భాషలో రాసిన ఈ లేఖలో.. దేశంలో మరింత హింస జరగకుండా ఉండటానికే తాను రాజీనామా చేసినట్లు ఆమె పేర్కొన్నారని ప్రచారం జరుగుతోంది. బంగ్లాదేశ్ విద్యార్థుల మృతదేహాలపై అమెరికా రాజకీయం చేస్తుందనీ.. సెయింట్ మార్టిన్ ద్వీపంపై అధికారాన్ని చేజిక్కించుకోవాలని యూఎస్ లక్ష్యంగా పెట్టుకుందనే ఆరోపణ చేసినట్లు చెబుతున్నారు. అయితే, హసీనా రాజీనామా చేయడం ద్వారా యుఎస్ కుట్రను నిరోధించినట్లు ఆమె లేఖలో పేర్కొన్నారని అంటున్నారు. బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరాన్ని నెలకొల్పేందుకు విదేశీయులను అనుమతిస్తే తనకు సులభంగా మళ్లీ ఎన్నికయ్యే అవకాశం ఉండేదనీ ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అలాగే, పదవికి రాజీనామా చేయకుముందు ప్రజలను ఉద్దేశించి, ఆమె ప్రసంగించాలని అనుకున్నారనీ దానికి సంబంధించిన స్పీచ్ కూడా సిద్ధం చేసుకున్నట్లు ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె ప్రస్తావించారు. ఈ ప్రసంగంలో ప్రజలకు ఈ ఆందోళనల వెనుక అమెరికా పాత్ర ఉందని చెప్పాలని అనుకున్నా.. అవకాశం లభించలేదని ఆమె వెల్లడించారు. అయితే, ప్రసంగం చేయకముందే దేశంలో ఆందోళనలు చేయిదాటి పోవడంతో, ఆర్మీ హెచ్చరికల దృష్ట్యా భారత్‌కు వచ్చినట్లు ఆమె తెలిపారు.

Also Read: పాక్ ఐఎస్ఐ మాజీ చీఫ్ అరెస్ట్!

బహుశా తాను బంగ్లాదేశ్‌లో ఉండి ఉంటే ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు బలి కావాల్సి వచ్చేదనీ.. ఏదీ ఏమైనప్పటికీ… తన పార్టీ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని మళ్లీ బలం పుంజుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దయచేసి, మీరు విశ్వాసం కోల్పోవద్దు… నేను తప్పకుండా తిరిగి వస్తానని ఆమె వెల్లడించారు. నేను ఓడిపోయనా.. బంగ్లాదేశ్ గెలిచిందనీ.. దేశ ప్రజల కోసమే తన తండ్రి, కుటుంబం ప్రాణాలు అర్పించదనీ ఈ సందర్భంగా హసీనా చెప్పారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనా తిరిగా త్వరలోనే బంగ్లాదేశ్ వస్తారని ఆమె కొడుకు సాజిబ్ ప్రకటించారు.

అయితే, హసీనా లేఖపై జరుగుతున్న ప్రచారాన్ని సాజిబ్ కొట్టిపారేశారు. తన తల్లి అలాంటి ప్రకటన ఏదీ ఇవ్వలేదని సాజీబ్ వాజెద్ స్పష్టం చేశారు. ‘ఒక వార్తాపత్రికలో ప్రచురించిన ఇటీవలి రాజీనామా ప్రకటన పూర్తిగా అబద్ధమనీ, కల్పితమనీ.. ఢాకాను విడిచిపెట్టడానికి ముందు గానీ, తర్వాత గానీ, ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదని నేను ఫోన్ కాల్‌లో ఆమెతో నుండి స్పష్టత తీసుకున్నట్లు సాజిబ్ వాజెద్ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయినప్పటికీ, ప్రస్తుతం సెయింట్ మార్టిన్ ద్వీపం వ్యవహారంలో అమెరికా ఒత్తిడి సందేహాలకు తావిస్తున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×