EPAPER

Caves under Moon’s Surface: జాబిల్లిపై గుహ.. అయితే షెల్టర్లు ఖాయమా..?

Caves under Moon’s Surface: జాబిల్లిపై గుహ.. అయితే షెల్టర్లు ఖాయమా..?

Caves Under Moon’s Surface: చందమామపై యాత్రలు ప్రారంభించాలని భావిస్తున్న శాస్త్రవేత్తలకు గుడ్ న్యూస్. జాబిలిపై ఒక గుహ ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఆ తరహా గుహలు పదుల సంఖ్యలో ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


జాబిల్లి గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత వాతావరణాన్ని అంచనా వేశారు శాస్త్రవేత్తలు. అక్కడి నమూనాలను సేకరించి నివాసానికి అనుకూలమైనదా కాదా తేల్చే పనిలో పడ్డారు. తాజాగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. చందమామపై గుహ ఉండవచ్చని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు.

చందమామపై అత్యంత లోతైన బిలం నుంచి గుహలోకి ఎంట్రీ ఉంటుందని అంచనాకు వస్తున్నారు. ఈ ప్రాంతం 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్- ఆల్డ్రిన్లు అడుగుపెట్టిన ప్రదేశానికి 400 కిలోమీటర్లు దూరంలో ఉందని . అయితే ఇది ఎలా ఏర్పడిందనే దానిపై విశ్లేషణ చేస్తున్నారు. లావా ద్వారా అది ఏర్పడిందన్నది పరిశోధకుల మాట.


Scientists find caves under Moon's surface, can be used as shelter for astronauts
Scientists find caves under Moon’s surface, can be used as shelter for astronauts

Also Read: రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌, ఉపాధ్యక్ష పదవికి ఆంధ్ర అల్లుడు!

నాసా ప్రయోగంచిన లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ అందించిన సమాచారం ప్రకారం దీన్ని విశ్లేషించారు పరిశోధకులు. భూమి మీద ఏర్పడిన లావా సొరంగాలతో దీన్ని పోల్చిచూశారు. అయితే చంద్రుడిపై గుహకు సంబంధించి మరికొంత సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

వెడవు, వెడల్పులను అంచనా కట్టే పనిలో నిమగ్నమయ్యారు. వెడల్పు దాదాపు 130 అడుగులు, పొడవు ఇంకా అంచనా వేస్తున్నారు. ఈ తరహా గుహలు వ్యోమగాములకు షెల్టర్లుగా పని కొస్తాయన్నది శాస్త్రవేత్తల మాట. విశ్వం నుంచి వచ్చే ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాలు, చిన్నపాటి ఉల్కల నుంచి ఇవి రక్షిస్తాయని అంటున్నారు.

Also Read: Joe Gow: భార్యతో శృంగారం చేస్తూ వీడియో తీసిన యూనివర్సిటీ చాన్సెలర్.. అడల్ట్ వెబ్‌సైట్‌లో వీడియో పోస్ట్..

జాబిల్లిపై ఆవాసాలు నిర్మించడానికి చాలా సమయం పడుతుందని, చాలా సవాళ్లతో కూడిన వ్యవహారమ న్నది వారి మాట. వీటి ద్వారా చంద్రుడి పుట్టుక గురించి లోతైన వివరాలు తెలుసుకోవచ్చని అంటున్నారు. మొత్తానికి చంద్రుడి గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×