EPAPER

Russian Ukraine Peace Deal| ‘ఉక్రెయిన్ తో శాంతి చర్చలకు రష్యా రేడీ.. కానీ’.. షరతులు విధించిన క్రెమ్లిన్ ప్రతినిధి

Russian Ukraine Peace Deal| ‘ఉక్రెయిన్ తో శాంతి చర్చలకు రష్యా రేడీ.. కానీ’.. షరతులు విధించిన క్రెమ్లిన్ ప్రతినిధి

Russian Ukraine Peace Deal| ఉక్రెయిన్ తో శాంతి చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. కానీ అందుకు ఉక్రెయిన్ ముందుకు రావడం లేదని రష్యా ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ గురువారం మీడియా సమావేశంలో అన్నారు. యుద్ధం ముగించడానికి తాము ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నామని.. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ.. పశ్చిమ దేశాల చేతిలో కీలుబొమ్మలా మారిపోయారని ఎద్దేవా చేశారు. గత రెండేళ్లుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు చైనా కూడా కృషి చేస్తోంది.


చైనా పర్యటనలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా.. రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని అయితే ముందు దేశ సార్వభౌమత్వం భంగం కాకుండా, దేశ సరిహద్దులును రష్యా గౌరవించాలని అన్నారు.

మరోవైపు రష్యా ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్.. ఉక్రెయిన్ అధ్యక్షుడి పదవి కాలం మే నెలలోనే ముగిసినా ఆయన ఎలా అధికారంలో కొనసాగుతున్నారని.. ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ”శాంతి చర్చలకు మేము సిద్ధంగానే ఉన్నాం.. కానీ ముందు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందా?.. అమెరికా, పశ్చిమ దేశాల చేతిలో కీలుబొమ్మగా ఉన్న జెలెన్ స్కీకి అతని యజమానులు శాంతి చర్చల కోసం అనుమతిస్తారా? అనేవి అనుమానం కలిగించే విషయాలు. శాంతి చర్చల విషయంలో జెలెన్ స్కీ ఒక మాట అంటారు. ఆయన వెనుక ఉన్న ఫ్రాన్స్ లాంటి దేశాల ప్రతినిధులు మరో మాట అంటారు. చర్చల విషయంలో అసలు స్పష్టత లేదు. రష్యాతో నేరుగా మాట్లాడడానికి జెలెన్ స్కీపై పశ్చిమ దేశాలు నిషేధం విధించాయి.” అని ఘాటుగా విమర్శించారు.


Also Read:  టర్కీలో ప్రమాదం, రష్యా అందగత్తె బైకర్ టాట్యానా మృతి

జెలెన్ స్కీ పదవీ కాలం ముగిసిన విషయంపై సమాధానంగా జెలెన్ స్కీ, పశ్చిమ దేశాలు.. యుద్ధ సమయంలో సాధారణ రాజకీయ నియమాలు వర్తించవని.. అయినా నియంతృత్వ పాలనా విధానం ఉన్న రష్యా దేశానికి ఈ ప్రశ్నలు అడిగే హక్కులు లేవని చెప్పారు.

జూన్ నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ముగించేందుకు షరతులు విధించారు. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరే ఆలోచనలు మానుకోవాలి, ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాలను రష్యాకు అప్పగించాలి.. అప్పుడే యుద్ధం ముగుస్తుందని స్పష్టం చేశారు. కానీ దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు కానీ, ఆయన వెనుక ఉన్న పశ్చిమ దేశాలు కానీ స్పందించలేదు. దీంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది.

ALSO READ: ఆందోళనకరంగా జపాన్ జనాభా తగ్గుదల.. వరుసగా 15వ ఏడాది తగ్గిన జననాల సంఖ్య!

 

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×