EPAPER

Bangladesh: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్, వేటాడి ఊచకోత

Bangladesh: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్, వేటాడి ఊచకోత

Roaring Bangladesh Hunted And Massacred: గత కొన్నిరోజులుగా బంగ్లాదేశ్ రాష్ట్రం అట్టుడుకుతోంది. రిజర్వేషన్ల రద్దు కోసం జరిగిన హింసకాండలో బంగ్లాదేశ్‌ రాష్ట్రంలో వందల మంది నిరసనకారులు తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా ఈ నిరసన మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీ అవామి లీగ్ నేతలకు మృత్యుపాశంగా మారిన పరిస్థితి. ఆందోళనకారులు అవామి లీగ్ నేతలను వేటాడి ఊచకోత కోశారు. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అవామి లీగ్ నేతల మృతదేహాలు లభ్యమయ్యాయి. బంగ్లాదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తాజాగా 30 మృతదేహాలను గుర్తించారు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. కొమిల్లాలో 12 మంది దాడుల్లో ప్రాణాలను కోల్పోయారని పేర్కొన్నారు. అశోక్తలాలో ఒక మూక మాజీ కౌన్సిలర్ ఎండీ షా ఆలం ఇంటికి నిప్పు పెట్టినట్టు గుర్తించారు. ఇందులో ఐదుగురు టీనేజర్లతో పాటుగా మరో ఆరుగురు సజీవదహనమయ్యారు. నటోరె ప్రాంతంలో ఆందోళనకారులు ఒక ఎంపీ ఇంటికి నిప్పుపెట్టగా, ఆ ఇంట్లోని గదుల్లో మృతదేహాలు లభ్యమయినట్లు అక్కడి స్థానిక మీడియా తెలిపింది.


గత మూడురోజుల నుండి బంగ్లాదేశ ఆందోళనకారులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అవామీ లీగ్ పార్టీతో సంబంధాలున్న వారిపై దాడికి తెగపడుతున్నారు. అంతేకాకుండా అందులోని నిరసనకారులంతా ఎక్కడికక్కడ ఊచకోతకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారని తెలియగానే నిరసనకారులు ఆమె మద్దతుదారులపై దాడులకు దిగారు. ఈ ఘటనల్లో యువ నటుడు శాంతోతో పాటుగా ఒక దర్శకుడిని నిరసనకారులు అత్యంత క్రూరంగా చంపివేశారు. నిరసనకారులు వీరిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి చంపివేసినట్టు అక్కడి స్థానిక పోలీసులు వివరాలను వెల్లడించారు. ఈ నటుడు గతంలో హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బయోపిక్‌లో యాక్ట్ చేశారు.

Also Read: మిడ్‌నైట్‌.. ఆగని ఆ జంట, ఏకంగా కారు రూఫ్‌పై..


ఇంతటితో ఆగకుండా అక్కడి జానపద గాయకుడు రాహుల్ ఆనందోకు చెందిన నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. నిరసనకారులు దాడి చేయగానే రాహుల్ కుటుంబం అక్కడి నుండి వేరే ప్రాంతానికి ప్రాణభయంతో పరుగులు తీయడంతో వారి ప్రాణాలు పోకుండా కాపాడుకున్నారు. ప్రస్తుతం వారంతా రహస్య ప్రాంతంలో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. జషోర్ జిల్లాలోని అవామీలాగ్ నేతకు చెందిన ఓ హెటల్‌కి అల్లరిమూకలు నిప్పుపెట్టాయి. ఈ ఘటనలో ఈ ఘటనలో 25 మంది సజీవదహనమయ్యారు. మూడు వారాల పాటు ఆందోళనల్లో ఇప్పటివరకు 450 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు రోజుల క్రితం ఒక్కరోజే 110 మంది మృత్యువాత పడినట్టు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×