EPAPER
Kirrak Couples Episode 1

Rice: అమెరికాలో బియ్యం కష్టాలు.. ఎన్నారైల అగచాట్లు..

Rice: అమెరికాలో బియ్యం కష్టాలు.. ఎన్నారైల అగచాట్లు..
rice usa

Rice: అవును, మీరు చదివింది నిజమే. అమెరికాలో బియ్యం కష్టాలు వచ్చాయి. రైస్ తినే అలవాటు ఉన్నవాళ్లంతా బియ్యం కోసం ఎగబడుతున్నారు. స్టోర్స్‌లో పోటాపోటీగా బియ్యం కొంటున్నారు. వచ్చిన స్టాక్ వచ్చినట్టే అమ్ముడైపోతోంది. కిలో బియ్యం కోసం కిలోమీటర్ల కొద్దీ లైనుల్లో నిలబడాల్సిందే. సూపర్ మార్కెట్లలో బియ్యం కొనుగోళ్లకు కండిషన్స్ కూడా పెడుతున్నారు. ఒక్కో కస్టమర్ కనీసం 25 డాలర్ల మేర ఇతర వస్తువులు కొంటేనే.. ఒక బ్యాగ్ రైస్ ఇస్తామంటూ బోర్డులు పెట్టారు.


అగ్రరాజ్యంలో బియ్యానికి ఇంతటి డిమాండ్ మునుపెన్నడూ లేదు. అందుకు కారణం ఇండియానే. మన దేశం తీసుకున్న ఓ నిర్ణయం.. అమెరికాకు అన్నం దొరక్కుండా చేస్తోంది. ఇండియా నుంచి దిగుమతులు ఆగిపోవడంతో.. అక్కడ బియ్యం ధర భారీగా పెరగడంతో పాటు షార్టేజ్ కూడా ఏర్పడింది. అందుకే, సరుకు ఉన్నప్పుడే కొనుక్కొని దాచుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నారైలు డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌కు క్యూ కడుతున్నారు. భారీగా బియ్యం బ్యాగులు కొంటున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు అయిన భారతదేశం, దేశీయంగా బియ్యం ధరలను అదుపులో ఉంచడానికి గురువారం అర్థరాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. బాస్మతి బియ్యం తప్ప.. అన్ని రకాల తెల్ల బియ్యం ఎగుమతులను నిలిపివేసింది. ఈ నిర్ణయం ప్రపంచ ఆహార భద్రతకు మరింత ముప్పు కలిగిస్తుందనే భయం పెరిగింది. ఇప్పటికే అధిక ఆహార-ధరల ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నఆఫ్రికన్ దేశాలు, టర్కీ, సిరియా, పాకిస్తాన్ దేశాలు ఈ నిర్ణయంతో తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.


దీనికి ముందు రష్యా, నల్ల సముద్రం గుండా ఉక్రేనియన్ ధాన్యాలను అనుమతించే కీలకమైన UN-బ్రోకర్డ్ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల కొంత బియ్యం కొరత కనిపించింది. ఇండియా తీసుకున్న ప్రస్తుత నిర్ణయంతో అది మరింత తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. భారత దేశంలో ప్రజలకు బియ్యం కొరత లేకుండా చేయడం కోసం, అలాగే “దేశీయ మార్కెట్‌లో ధరల పెరుగుదలను తగ్గించడానికి” ఈ చర్య తీసుకున్నట్లు భారత ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో బియ్యం ధరలు గత ఏడాది కంటే 11.5%, గత నెలలో 3% పెరిగాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

భారతదేశం ప్రపంచంలోని బియ్యం రవాణాలో 40% వాటాను కలిగి ఉంది. అలాగే, 2022లో దేశం రికార్డు స్థాయిలో 22.2 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. 2022 నుండి భారతదేశం, బియ్యం ఎగుమతుల్లో దాదాపు సగం.. 10.3 మిలియన్లు.. బాస్మతీయేతర తెల్ల బియ్యమే ఉన్నాయి. అయితే, ప్రస్తుత ఈ నిషేధంతో బాస్మతీయేతర బియ్యం ప్రధాన కొనుగోలుదారులు, ఇండియా పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్‌తో పాటు బెనిన్, అంగోలా, కామెరూన్, జిబౌటి, గినియా, ఐవరీ కోస్ట్, కెన్యా వంటి అనేక ఆఫ్రికన్ దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇక, రష్యా, ఉక్రేయిన్‌ల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా నల్ల సముద్రం గుండా ఉక్రేనియన్ ఆహార ధాన్యాలను తరలించడానికి అనుమతించే కీలక ఒప్పందాన్ని రష్యా రద్దు చేసింది. దీనికి కొద్ది రోజుల తర్వాత భారతదేశం కూడా రైస్ ఎగుమతిపై నిషేధం విధించింది. దీనితో పాటు, గోధుమ, మొక్కజొన్న, సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్రధాన ప్రపంచ సరఫరాదారుగా ఉన్న ఉక్రెయిన్ నుండి కూడా నిషేధం ఉండటంతో ఈ పరిస్థితి ప్రపంచ ఆహార భద్రతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, దీనికి కారణమైన రష్యా తన నిర్ణయాని కారణం పశ్చిమ దేశాలంటూ ఆరోపిస్తోంది.

మరోవైపు, గత కొన్ని వారాలుగా భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు పంజాబ్, హర్యానాతో పాటు పలు రాష్ట్రాల్లో కొత్తగా నాటిన పంటలను దెబ్బతీశాయి. దీనితో, చాలా మంది రైతులు తిరిగి నాట్లు వేయాల్సి వచ్చింది. ఉత్తరాది రాష్ట్రాల్లోని వరి, వరి పొలాలు నీట మునిగాయి. వరి నారు కూడా దెబ్బతింది. తిరిగి నారు వేద్దామన్నా పొలాల్లో ఉన్న వరద నీటి తగ్గుదల కోసం వేచి ఉండాల్సి వచ్చింది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా వరి పండించే ఇతర రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల్లో, రైతులు వరి నారును సిద్ధం చేశారు. అయితే, ఇక్కడ సరైన వర్షాలు కురవకపోవడంతో నారును నాటుకోలేకపోయారు. అందులోనూ, భారతదేశంలో బియ్యం ధరలు గతేడాదిలో మార్చితో పోల్చుకుంటే 14 నుండి 15 శాతం పెరిగాయి. దేశీయ ఆహార భద్రత, ద్రవ్యోల్బణం దిశగా చూసినప్పుడు ఈ పరిస్థితి రెడ్ లైన్‌గా పరిగణిస్తున్నారు. ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్య ఇండియా బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే పరిస్థితి లేదు.

ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉంది. అమెరికన్లు అన్నం తినరు. యూఎస్‌లో రైస్ కొనేది మన ఎన్నారైలే. ఇండియా తీసుకున్న నిర్ణయం.. ఇతర దేశాల్లో ఉంటున్న భారతీయులపైనే ప్రభావం చూపుతోంది.

Related News

Chiranjeevi : గిన్నిస్ రికార్డులో మెగాస్టార్ కి చోటు.. అమీర్ ఖాన్ చేతుల మీదుగా..!

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

World’s Tallest Bridges Guizhou: ప్రపంచంలోనే 100 ఎత్తైన వంతెనల్లో 49 ఒకే రాష్ట్రంలో.. ప్రకృతి ఒడిలో ఈ అందమైన బ్రిడ్జిలు ఒక్కసారైనా చూడాలి!

Gunfire in America: అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకీ.. నలుగురు మృతి

PM Modi Quad: ‘ప్రపంచవ్యాప్తంగా సర్వికల్ క్యాన్సర్‌తో పోరాటంలో భారత్ కీలక పాత్ర’.. 75 లక్షల డాలర్లు ప్రకటించిన ప్రధానీ మోదీ

Indian stuck in Foreign for 23 years: పరాయి దేశంలో 23 ఏళ్లుగా చిక్కుకుపోయిన భారతీయుడు.. ఎలా తిరిగొచ్చాడంటే..

Elections: టెన్షన్ టెన్షన్… మరికొద్ది సేపట్లోనే ఆ ఎన్నికల ఫలితాలు..

Big Stories

×